మెట్రో భవన్‌లో కాళోజీ జయంతి

దిశ, న్యూస్‌బ్యూరో: ప్రజాకవి కాళోజీ నారాయణరావు జన్మదినం సందర్భంగా హైదరాబాద్ మెట్రో రైల్ భవన్‌లో తెలంగాణ భాషా దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. హెచ్ఎమ్ఆర్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి ఈ సందర్భంగా కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. తనను ప్రభావితం చేసిన కవులలో కాళోజీ ముఖ్యుడని పేర్కొంటూ, కాళోజీ రచించిన ‘నా గొడవ’ లోని కొన్ని కవితలను చదివి వినిపించారు. కాళోజీ తెలుగు భాషకు, ప్రజలకు, సంస్కృతికి చేసిన సేవలను నేటి యువత […]

Update: 2020-09-09 09:40 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: ప్రజాకవి కాళోజీ నారాయణరావు జన్మదినం సందర్భంగా హైదరాబాద్ మెట్రో రైల్ భవన్‌లో తెలంగాణ భాషా దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. హెచ్ఎమ్ఆర్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి ఈ సందర్భంగా కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. తనను ప్రభావితం చేసిన కవులలో కాళోజీ ముఖ్యుడని పేర్కొంటూ, కాళోజీ రచించిన ‘నా గొడవ’ లోని కొన్ని కవితలను చదివి వినిపించారు. కాళోజీ తెలుగు భాషకు, ప్రజలకు, సంస్కృతికి చేసిన సేవలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు.

Tags:    

Similar News