ధోనీ ఫస్ట్.. రాహుల్ నెక్స్ట్ !

టీమిండియాలో ఎంఎస్ ధోనీకి చోటు కల్పించాల్సిందేనని.. అతడిలో ఇంకా క్రికెట్ ఆడే సత్తా ఉందని మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ అన్నాడు. కాగా, ధోనీ రిటైర్మెంట్ గురించి సీనియర్లందరూ మాట్లాడుతున్న సమయంలో కైఫ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రాబోయే టీ20 వరల్డ్ కప్‌లో ధోనీ అవసరం ఎంతో ఉందనే విషయన్ని టీమిండియా యాజమాన్యం గుర్తించాలని కైఫ్ తెలిపాడు. ‘కేఎల్ రాహుల్‌ను వికెట్ కీపర్‌గా వాడుకోవాలని.. ధోనీతో పెద్దగా అవసరం లేదన్న’ గౌతమ్ గంభీర్ వ్యాఖ్యల్ని కైఫ్ […]

Update: 2020-04-16 05:15 GMT

టీమిండియాలో ఎంఎస్ ధోనీకి చోటు కల్పించాల్సిందేనని.. అతడిలో ఇంకా క్రికెట్ ఆడే సత్తా ఉందని మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ అన్నాడు. కాగా, ధోనీ రిటైర్మెంట్ గురించి సీనియర్లందరూ మాట్లాడుతున్న సమయంలో కైఫ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రాబోయే టీ20 వరల్డ్ కప్‌లో ధోనీ అవసరం ఎంతో ఉందనే విషయన్ని టీమిండియా యాజమాన్యం గుర్తించాలని కైఫ్ తెలిపాడు. ‘కేఎల్ రాహుల్‌ను వికెట్ కీపర్‌గా వాడుకోవాలని.. ధోనీతో పెద్దగా అవసరం లేదన్న’ గౌతమ్ గంభీర్ వ్యాఖ్యల్ని కైఫ్ కొట్టిపడేశాడు. అంతేకాకుండా కేఎల్ రాహుల్‌పై కీపర్‌గా అదనపు బాధ్యతలు మోపడం మంచిది కాదన్నాడు. ‘మంచి బ్యాట్స్‌మన్ అయిన రాహుల్‌ను బ్యాకప్ వికెట్ కీపర్‌గా మాత్రమే ఉపయోగించుకోవాలని.. టీ20 వరల్డ్ కప్‌లో ధోనీనే కీపర్‌గా కొనసాగించాలని కైఫ్ అన్నాడు.

ఐపీఎల్ ద్వారా ధోనీ పునరాగమనం చేస్తాడని చాలా మంది అభిమానులు ఎదురు చూశారు. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఐపీఎల్ జరుగుతుందో లేదో అన్న అనుమానాల నేపథ్యంలో ధోనీ కెరీర్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. కాగా, ‘ఐపీఎల్ ఆధారంగా ధోనీ ఫామ్‌ను తాను అంచనా వేయలేనని.. ధోనీ ఎప్పటికీ అద్భుతమైన బ్యాట్స్‌మన్, మంచి ఫినిషర్ అని’ కైఫ్ చెప్పుకొచ్చాడు.

Tags : MS Dhoni, Mohmod Kaif, KL Rahul, T20 World cup, IPL

Tags:    

Similar News