ఆ ఇద్దరు కలిసి 13వ సారి.. అంతా సీసీ కెమెరాలో రికార్ట్
దిశ, ఆసిఫాబాద్ రూరల్ : దొంగతనాలనే వృత్తిగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతోన్న ఇద్దరు వ్యక్తులను కాగజ్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు 12 దొంగతనాలు చేసి పోలీసులకు సవాల్ విసిరిన చోరులకు ఎట్టకేలకు చెక్ పెట్టారు. దీనికి సంబంధించిన వివరాలను జిల్లా అడ్మిన్ ఎస్పీ సురేంద్ర కాగజ్ నగర్‌లో మీడియాకు వెల్లడించారు. ఆసిఫాబాద్‌కు చెందిన శంకర్, మంచిర్యాలకు చెందిన దేవాజీలు దొంగతనాలనే వృత్తిగా చేసుకొని జిల్లాలో పలు దొంగతనాలకు పాల్పడ్డారు. వీరిద్దరు […]
దిశ, ఆసిఫాబాద్ రూరల్ : దొంగతనాలనే వృత్తిగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతోన్న ఇద్దరు వ్యక్తులను కాగజ్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు 12 దొంగతనాలు చేసి పోలీసులకు సవాల్ విసిరిన చోరులకు ఎట్టకేలకు చెక్ పెట్టారు. దీనికి సంబంధించిన వివరాలను జిల్లా అడ్మిన్ ఎస్పీ సురేంద్ర కాగజ్ నగర్‌లో మీడియాకు వెల్లడించారు.
ఆసిఫాబాద్‌కు చెందిన శంకర్, మంచిర్యాలకు చెందిన దేవాజీలు దొంగతనాలనే వృత్తిగా చేసుకొని జిల్లాలో పలు దొంగతనాలకు పాల్పడ్డారు. వీరిద్దరు ఈ నెల 7న కాగజ్ నగర్‌లోని ఇందిర మార్కెట్‌లో రాత్రి 8 గంటల సమయంలో నీకూరే ప్రమీల ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన కాగజ్ నగర్ టౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే దేవాజీ పై మంచిర్యాల్ పోలీస్ స్టేషన్‌లో సస్పెక్ట్ షీట్ నమోదయ్యి ఉంది. ఈ నేపథ్యంలో ఆ దిశగా కేసు దర్యాప్తు చేసిన పోలీసులకు సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించి బుధవారం అరెస్ట్ చేశారు.
శంకర్, దేవాజీలు జిల్లాలో 12 చోరీలకు పాల్పడ్డారు. పలు కేసుల్లో అరెస్టై జైలుకు వెళ్లి వచ్చినా.. మళ్లీ దొంగతనాలకే పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. గత సంవత్సరం డిసెంబర్ 3న ఆసిఫాబాద్ కూరగాయల మార్కెట్‌లో ఒక మహిళ వద్ద నుండి రూ.60 వేలు చోరీ కేసులో రూ.50 వేలు రికవరీ చేసినట్లు వెల్లడించారు. తాజా కేసులో నిందితుల నుంచి రూ.4.25 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు అడ్మిన్ ఎస్పీ సురేంద్ర చెప్పారు.
నిందితులపై ఐపీసీ సెక్షన్ 379 కింద కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. నేరస్తుల గుర్తింపు, శాంతి భద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాల పాత్ర మరోసారి రుజువైందని, నేరం జరగకుండా ఉండేందుకు అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. అనంతరం కేసును ఛేదించిన ఎస్ఐ సీహెచ్.సనత్ రెడ్డి, ఎస్ఐ ఎం.తేజస్విని, సీసీఎస్ కానిస్టేబుల్ తిరుపతయ్య, విజయ్, వెంకటేష్‌లకు రివార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ కరుణాకర్, టౌన్ సీఐ రాజేంద్ర ప్రసాద్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.