కరోనా కష్టాలు.. కవలల్ని కాపాడిన పోలీసులు
కరోనా కష్టాలు వెంటాడిన వేళ పోలీసులు ప్రాణాలు కాపాడిన ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళ్తే.. కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలం అబ్బాపురానికి చెందిన రమాదేవి టెస్టు ట్యూబ్ విధానంలో గర్భం దాల్చారు. నెలలు నిండకుండానే ఏడోనెలలో కవలలకు జన్మనిచ్చారు. అయితే రిమ్స్‌లో సరైన చికిత్స అందుబాటులో లేకపోవడంతో, నియోనిటాల్ ఐసీయూ సౌకర్యాలున్న ప్రైవేటు ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. లేకపోతే కవలలు బతకడం కష్టమని తేల్చిచెప్పారు. దీంతో వారు ఆసుపత్రులన్నీ మూసేశారని, తమ […]
కరోనా కష్టాలు వెంటాడిన వేళ పోలీసులు ప్రాణాలు కాపాడిన ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళ్తే.. కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలం అబ్బాపురానికి చెందిన రమాదేవి టెస్టు ట్యూబ్ విధానంలో గర్భం దాల్చారు. నెలలు నిండకుండానే ఏడోనెలలో కవలలకు జన్మనిచ్చారు. అయితే రిమ్స్‌లో సరైన చికిత్స అందుబాటులో లేకపోవడంతో, నియోనిటాల్ ఐసీయూ సౌకర్యాలున్న ప్రైవేటు ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. లేకపోతే కవలలు బతకడం కష్టమని తేల్చిచెప్పారు. దీంతో వారు ఆసుపత్రులన్నీ మూసేశారని, తమ పిల్లల్న బతికించండంటూ ఎస్పీ అన్బురాజ్‌ను దంపతులు ఆశ్రయించారు. ఆయన వెంటనే డీఎస్పీకి సూచనలు అందజేయడంతో ఒక ప్రైవేటు ఆసుపత్రిని తెరిపించి తల్లీ బిడ్డలను అక్కడికి తరలించి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.
Tags: police help, kadapa district, corona, private hospital, twins birth