కారులోనే విద్యార్థినిపై లెక్చరర్ అత్యాచారం.. నగ్న ఫోటోలతో రోజూ..
దిశ, వెబ్‌డెస్క్ : తల్లిదండ్రుల తర్వాత గురువుకే ప్రాధాన్యం ఇస్తారు. విద్యార్థిని కంటికి రెప్పలా చూస్తూ.. ప్రయోజకుడిని చేయాల్సిన గురువులు కొందరు వక్రబుద్ధి చూపిస్తున్నారు. గురువు అనే పదానికే మచ్చ తెస్తూ విద్యా్ర్థినుల జీవితాలను పాడు చేస్తున్నారు. తాజాగా ఓ జూనియర్ లెక్చరర్ విద్యార్థినికి కూల్ డ్రింక్‌లో మత్తు మందు కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. తమిళనాడులోని తిరునెల్వేలి కాలేజీలో చదువుతున్న ఓ విద్యార్థినిపై అదే కళాశాలలో పని చేసే జూనియర్ […]
దిశ, వెబ్‌డెస్క్ : తల్లిదండ్రుల తర్వాత గురువుకే ప్రాధాన్యం ఇస్తారు. విద్యార్థిని కంటికి రెప్పలా చూస్తూ.. ప్రయోజకుడిని చేయాల్సిన గురువులు కొందరు వక్రబుద్ధి చూపిస్తున్నారు. గురువు అనే పదానికే మచ్చ తెస్తూ విద్యా్ర్థినుల జీవితాలను పాడు చేస్తున్నారు. తాజాగా ఓ జూనియర్ లెక్చరర్ విద్యార్థినికి కూల్ డ్రింక్‌లో మత్తు మందు కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
తమిళనాడులోని తిరునెల్వేలి కాలేజీలో చదువుతున్న ఓ విద్యార్థినిపై అదే కళాశాలలో పని చేసే జూనియర్ లెక్చరర్ కన్నేశాడు. ఆమెను ఎలాగైన అనుభవించాలని అదునుకోసం చూస్తున్నాడు. ఇదే సమయంలో తమిళనాడులో లాక్ డౌన్ విధించడంతో విద్యార్థిని ఇంటి వద్దే ఉండిపోయింది. అయితే సదరు లెక్చరర్ ఆన్ లైన్ క్లాసుల పేరిట ఆమె నంబర్ తీసుకుని తరచూ ఫోన్ చేయడం ప్రారంభించాడు. ఇలా క్లాసులతో సంబంధం లేకుండా కాల్స్ చేస్తూ ఆమె పర్సనల్ విషయాలు తెలుసుకున్నాడు.
ఈ క్రమంలో విద్యార్థిని తన సొంత గ్రామానికి వెళ్తుందని తెలుసుకుని కారులో వెళ్లి బస్టాండ్‌లో కాపు కాశాడు. అక్కడ విద్యార్థినిని బలవంతంగా కారులో ఎక్కించుకుని తాను డ్రాప్ చేస్తానని ఆమె గ్రామానికి బయలుదేశాడు. మార్గమధ్యలో ఓ ఆలయం వద్ద ఆపి.. కూల్ డ్రింక్స్ తీసుకువచ్చాడు. విద్యార్థినిని తిరస్కరించినా.. బలవంతంగా తాపించాడు. అయితే అప్పటికే కూల్ డ్రింక్ లో మత్తు మందు కలపడంతో ఆమె మత్తులోకి జారుకుంది. కారులోనే విద్యార్థినిపై అత్యాచారం చేశాడు కామాంధ లెక్చరర్. మత్తు నుంచి తేరుకున్నాక తనపై లైంగిక దాడి జరిగిందని గుర్తించి విద్యార్థినిని జూనియర్ లెక్చరర్ ని నిలదీసింది.
అయితే తాను కావాలని అత్యాచారం చేయలేదని.. త్వరలో పెళ్లి చేసుకుంటానని ఓ కట్టుకథ చెప్పాడు. అత్యాచారం సమయంలో ఆమెను అర్థనగ్నంగా వీడియోలు, ఫోటోలు తీసుకున్నాడు. అనంతరం విద్యార్థినిని ఆమె సొంతూరు బస్టాండ్ లో వదిలి వెళ్లిపోయాడు. ఈ ఘటన అనంతరం కూడా జూనియర్ లెక్చరర్ విద్యార్థినికి తరుచూ ఫోన్లు చేస్తూ వేధించడం ప్రారంభించాడు. అతడి టార్చర్ రోజురోజుకు ఎక్కువ కావడంతో ఆమె చెన్నై పోలీస్ కమిషనర్ కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది. దీంతో ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు పరారీలో ఉన్న ఆ కామాంధ జూనియర్ లెక్చరర్ ఆచూకీ కోసం వెతుకుతున్నారు.