జూన్‌లో భారీగా పుంజుకున్న వాహనాల అమ్మకాలు!

దిశ, వెబ్‌డెస్క్ : కొవిడ్ మహమ్మారి సెకెండ్ వేవ్ కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న ఆటో రంగం జూన్‌లో గణనీయంగా పుంజుకుంది. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో కరోనా ఆంక్షల కారణంగా మే నెలలో వాహనాల అమ్మకాలు భారీగా క్షీణించిన తర్వాత జూన్ నెలలో కరోనా ప్రతికూల అమ్మకాలు మెరుగుపడ్డాయి. ప్రధానంగా దేశీయ దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ ఏకంగా 200 శాతానికి పైగా పుంజుకోవడం గమనార్హం. మే నెలతో పోలిస్తే జూన్‌లో మారుతీ, మహీంద్రా, టాటా మోటార్స్, […]

Update: 2021-07-01 08:54 GMT

దిశ, వెబ్‌డెస్క్ : కొవిడ్ మహమ్మారి సెకెండ్ వేవ్ కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న ఆటో రంగం జూన్‌లో గణనీయంగా పుంజుకుంది. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో కరోనా ఆంక్షల కారణంగా మే నెలలో వాహనాల అమ్మకాలు భారీగా క్షీణించిన తర్వాత జూన్ నెలలో కరోనా ప్రతికూల అమ్మకాలు మెరుగుపడ్డాయి. ప్రధానంగా దేశీయ దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ ఏకంగా 200 శాతానికి పైగా పుంజుకోవడం గమనార్హం. మే నెలతో పోలిస్తే జూన్‌లో మారుతీ, మహీంద్రా, టాటా మోటార్స్, హ్యూండాయ్ సహా దాదాపు అన్ని సంస్థలు అమ్మకాల్లో వృద్ధిని నమోదు చేశాయి. మారుతీ సుజుకి సంస్థ జూన్‌లో మొత్తం 1,47,368 యూనిట్లను విక్రయించింది. మే నెలలో కేవలం 46,555 యూనిట్లతో పోలిస్తే 217 శాతం పెరిగింది. లాక్‌డౌన్ సడలింపు కారణంగా యుటిలిటీ వాహన విభాగంలో బలమైన వృద్ధి నమోదైందని కంపెనీ తెలిపింది.

ఇక, సమీక్షించిన నెలలో మొత్తం 17,237 యూనిట్లను ఎగుమతి చేసింది. యుటిలిటీ వాహన అమ్మకాలు 25,484 యూంట్లకు పెరిగాయి. టాటా మోటార్స్ జూన్‌లో మొత్తం 24,110 యూనిట్లను విక్రయించి 59 శాతం వృద్ధి సాధించింది. మొత్తం అమ్మకాలు 78 శాతం పెరిగి 43,704 యూనిట్ల అమ్మకాలు నమోదు చేసింది. కమర్షియల్ వాహనాల విభాగంలో 22,100 యూనిట్లను విక్రయించింది. మహీంద్రా అండ్ మహీంద్రా మొత్తం 32,964 ప్యాసింజర్ వాహనాలను అమ్మగా, ప్యాసింజర్ వాహనాలు 16,913 యూనిట్లతో రెట్టింపు వృద్ధి నమోదు చేసింది.

ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో 16,051 యూనిట్లను విక్రయించింది. బజాజ్ ఆటో 27.3 శాతం వృద్ధి మొత్తం 3,46,136 యూనిట్లు అమ్ముడయ్యాయి. 1,55,640 టూ-వీలర్, ఎగుమతులు 14 శాతం వృద్ధితో 1,54,938 యూనిట్లను విక్రయించింది. హ్యూండాయ్ మోటార్ ఇండియా జూన్‌లో అమ్మకాలు 77 శాతం వృద్ధితో 54,474 యూనిట్లకు చేరుకున్నాయి. ఎగుమతులు 13,978 యూనిట్లకు పెరిగాయి. టూ-వీలర్ దిగ్గజం అమ్మకాలు 51 శాతం పెరిగి 2,51,886 యూనిట్లకు చేరుకున్నాయి. మోటార్‌సైకిల్ విభాగంలో 1,46,874 యూనిట్లు, స్కూటర్ విభాగంలో 54,595 యూనిట్లను విక్రయించింది. ఎగుమతులు స్వల్పంగా తగ్గి 1,06,246 యూనిట్లుగా నమోదయ్యాయి. కియా మోటార్ ఇండియా 36 శాతం పెరిగి 15,015 యూనిట్ల అమ్మకాలను సాధించింది.

Tags:    

Similar News