బైడెన్ నన్ను పబ్లిక్‌గా ముద్దుపెట్టాడు

దిశ, వెబ్‌డెస్క్: బహిరంగ కార్యక్రమాల్లో తనను ముద్దుపెట్టుకున్నారని, అసభ్యంగా తడిమారని, భుజాలను పట్టుకున్నారని కొందరు మహిళలు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన జో బైడెన్‌పై లైంగిక ఆరోపణలు చేశారు. అంతేగాకుండా తాను స్పర్శతో ప్రజలను దగ్గర చేసుకుంటారని, కానీ, అది తనను చాలా సార్లు చిక్కుల్లో పడేసిందని జో బైడెన్ పలుసార్లు అంగీకరించిన విషయం తెలిసిందే. నెవాడా అసెంబ్లీ వుమన్ లూసీ ఫ్లోర్స్ ఓ పత్రికలో బైడెన్‌ తనతో వ్యవహరించిన విధానాన్ని రాశారు. బైడెన్ వెనుక […]

Update: 2020-11-07 09:19 GMT

దిశ, వెబ్‌డెస్క్: బహిరంగ కార్యక్రమాల్లో తనను ముద్దుపెట్టుకున్నారని, అసభ్యంగా తడిమారని, భుజాలను పట్టుకున్నారని కొందరు మహిళలు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన జో బైడెన్‌పై లైంగిక ఆరోపణలు చేశారు. అంతేగాకుండా తాను స్పర్శతో ప్రజలను దగ్గర చేసుకుంటారని, కానీ, అది తనను చాలా సార్లు చిక్కుల్లో పడేసిందని జో బైడెన్ పలుసార్లు అంగీకరించిన విషయం తెలిసిందే. నెవాడా అసెంబ్లీ వుమన్ లూసీ ఫ్లోర్స్ ఓ పత్రికలో బైడెన్‌ తనతో వ్యవహరించిన విధానాన్ని రాశారు.

బైడెన్ వెనుక నుంచి తనకు దగ్గరగా వచ్చి చేతులు, భుజాలను పట్టుకుని తలను ముద్దాడారని, ఒక సన్నిహితురాలితో ఉన్నట్టుగానే ప్రవర్తించారని ఆరోపణలు చేశారు. మరో మహిళ అమీ లప్పోస్ బైడెన్ తనతో అసభ్యంగా కాదుకానీ, విచిత్రంగా ప్రవర్తించారని అన్నారు. బైడెన్ స్టాఫర్ తారా రీడ్ లైంగిక ఆరోపణలు చేశారు. 1993లో లైంగికదాడికి పాల్పడ్డారని ఆరోపించారు. కానీ, బైడెన్ బృందం ఆరోపణలను ఖండించింది. తన ప్రవర్తనలో దురుద్దేశం లేదని చెబుతూ బైడెన్ ఆమెకు క్షమాపణలూ చెప్పారు.

Tags:    

Similar News