అమెరికన్లకు బైడైన్ బంపర్ ఆఫర్..
దిశ, వెబ్‌డెస్క్ : అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయకముందే జో బైడైన్ అమెరికన్ ప్రజల కోసం బంపర్ ఆఫర్ ప్రకటించారు. కరోనా నియంత్రణ, ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి కృషి చేస్తానని చెప్పుకొచ్చారు. అందుకోసం 1.9ట్రిలియన్ డాలర్ల ఆర్థిక ప్రణాళికను ప్రకటించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు, రాష్ట్రాలు, స్థానిక ప్రభుత్వాలకు ఆర్థిక సాయం చేయనున్నట్లు వెల్లడించారు. దీనిని అమెరికన్ రెస్య్కూ ప్లాన్ పేరిట బైడెన్ ప్రతిపాదించారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వందరోజుల్లోగా 100 మిలియన్ల టీకాలు […]
దిశ, వెబ్‌డెస్క్ : అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయకముందే జో బైడైన్ అమెరికన్ ప్రజల కోసం బంపర్ ఆఫర్ ప్రకటించారు. కరోనా నియంత్రణ, ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి కృషి చేస్తానని చెప్పుకొచ్చారు. అందుకోసం 1.9ట్రిలియన్ డాలర్ల ఆర్థిక ప్రణాళికను ప్రకటించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు, రాష్ట్రాలు, స్థానిక ప్రభుత్వాలకు ఆర్థిక సాయం చేయనున్నట్లు వెల్లడించారు. దీనిని అమెరికన్ రెస్య్కూ ప్లాన్ పేరిట బైడెన్ ప్రతిపాదించారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వందరోజుల్లోగా 100 మిలియన్ల టీకాలు వేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని స్పష్టంచేశారు. అంతేకాకుండా ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం కోసం మరో దఫా సాయం అందించాలని నిర్ణయించామన్నారు. కాగా, జనవరి 20వ తేదీన అగ్రరాజ్యం నూతన అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.