3వేల మందికి విదేశాల్లో ఉద్యోగాలు
దిశ, ఏపీ బ్యూరో: ఓం క్యాప్ ద్వారా త్వరలో 3వేల మందికి జర్మనీ, యూరప్, గల్ఫ్ దేశాల్లో ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి వెల్లడించారు. మంగళవారం తాడేపల్లిలోని రాష్ర్ట నైపుణ్యాభివృద్ధి సంస్థ కార్యాలయంలో అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత తేలిగ్గా విదేశాల్లో ఉద్యోగాలు పొందేందుకు త్వరలో ఇంటర్నేషనల్ మైగ్రేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. గతేడాది రెండు వేల మందికి విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పించినట్లు తెలిపారు. కొవిడ్ […]
దిశ, ఏపీ బ్యూరో: ఓం క్యాప్ ద్వారా త్వరలో 3వేల మందికి జర్మనీ, యూరప్, గల్ఫ్ దేశాల్లో ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి వెల్లడించారు. మంగళవారం తాడేపల్లిలోని రాష్ర్ట నైపుణ్యాభివృద్ధి సంస్థ కార్యాలయంలో అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత తేలిగ్గా విదేశాల్లో ఉద్యోగాలు పొందేందుకు త్వరలో ఇంటర్నేషనల్ మైగ్రేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. గతేడాది రెండు వేల మందికి విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పించినట్లు తెలిపారు. కొవిడ్ కారణంగా 2020మార్చి నుంచి ఆశించినంతగా శిక్షణా కార్యక్రమాలను నిర్వహించలేదన్నారు. దాదాపు 2వేల ఖాళీలు వివిధ దేశాల్లో భర్తీ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఓం క్యాప్ దగ్గర ఇంటిపని వారు, వంటపని, ఎలక్ట్రీషియన్లు, డ్రైవర్లు, నర్సులు, ఫోర్క్ లిఫ్ట్ ఆపరేటర్లు ఉద్యోగాలకు సంబంధించి రెండు వేల మందిని విదేశాలకు పంపేందుకు సిద్ధంగా ఉన్నట్లు మంత్రి తెలిపారు.