వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలి : డివైఎఫ్ఐ

దిశ, పరకాల టౌన్ : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయకుండా కాలయాపన చేస్తూ నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణం అవుతున్నారని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు మంద సురేష్ తెలిపారు. ఈ సందర్భంగా పరకాల పట్టణంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో మంద సురేష్ మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు, ఇంటికొక ఉద్యోగం భర్తీ చేస్తామని యువతను మోసం చేసి ఎన్నికల్లో గెలిచారని అన్నారు.  రాష్ట్రంలో లక్షా 91000 ఉద్యోగ […]

Update: 2021-11-15 04:10 GMT

దిశ, పరకాల టౌన్ : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయకుండా కాలయాపన చేస్తూ నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణం అవుతున్నారని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు మంద సురేష్ తెలిపారు. ఈ సందర్భంగా పరకాల పట్టణంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో మంద సురేష్ మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు, ఇంటికొక ఉద్యోగం భర్తీ చేస్తామని యువతను మోసం చేసి ఎన్నికల్లో గెలిచారని అన్నారు. రాష్ట్రంలో లక్షా 91000 ఉద్యోగ ఖాళీలు ఉండగా రాష్ట్ర ప్రభుత్వం కేవలం 60 వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేస్తామని చెప్పడం బాధాకరమని పేర్కొన్నారు.
ఇప్పటికైనా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయకపోతే రాష్ట్రంలోని 28 లక్షల నిరుద్యోగులతో తిరుగుబాటు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు మడికొండ వరుణ్ ,నిశాంత్, ప్రశాంత్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News