యంగ్ సైంటిస్ట్ దివ్యశ్రీ వినూత్న ఆలోచన.. JNTU గుర్తింపు

దిశ, ఖమ్మం రూరల్: రైతులు పొలాల్లో క్రిమిసంహారక మందులు వాడకుండా.. పురుగులకు చెక్ పెట్టేందుకు యువ సైంటిస్ట్, ఇంజినీరింగ్ విద్యార్థిని దివ్యశ్రీ వినూత్న ఆలోచన చేసింది. ఓ అద్భుత ప్రాజెక్టును రూపొందించి నిరూపించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల ఉప్పసాకకు చెందిన ఇంజనీరింగ్​విద్యార్థిని దివ్యశ్రీ పురుగుల మందుకు ప్రత్యామ్నాయంగా రూపొందించిన ‘సోలార్ కంట్రోల్ ఇంటిగ్రెటెడ్​పేస్ట్​మెనేజ్​మెంట్​ సిస్టం’ కు జేఎన్‌టీయూ గుర్తింపు లభించింది. ప్రస్తుతం దివ్యశ్రీ ఖమ్మం రూరల్ మండలం సాయిప్రభాత్ నగర్‌లోని ప్రియదర్శిని ఇంజినీరింగ్ కళాశాలలో […]

Update: 2021-06-14 08:11 GMT

దిశ, ఖమ్మం రూరల్: రైతులు పొలాల్లో క్రిమిసంహారక మందులు వాడకుండా.. పురుగులకు చెక్ పెట్టేందుకు యువ సైంటిస్ట్, ఇంజినీరింగ్ విద్యార్థిని దివ్యశ్రీ వినూత్న ఆలోచన చేసింది. ఓ అద్భుత ప్రాజెక్టును రూపొందించి నిరూపించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల ఉప్పసాకకు చెందిన ఇంజనీరింగ్​విద్యార్థిని దివ్యశ్రీ పురుగుల మందుకు ప్రత్యామ్నాయంగా రూపొందించిన ‘సోలార్ కంట్రోల్ ఇంటిగ్రెటెడ్​పేస్ట్​మెనేజ్​మెంట్​ సిస్టం’ కు జేఎన్‌టీయూ గుర్తింపు లభించింది. ప్రస్తుతం దివ్యశ్రీ ఖమ్మం రూరల్ మండలం సాయిప్రభాత్ నగర్‌లోని ప్రియదర్శిని ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్(ఈఈఈ) థర్డ్ ఇయర్ చదువుతోంది. వివిధ రకాల పంటలపై పూత దశలో తియ్యని పదార్థాన్ని తినేందుకు పెద్దఎత్తున పురుగులు ఆకుచుట్టు వాలి పంటను నాశనం చేస్తుంటాయి. దీంతో పురుగుల దాడితో రైతులు దిగుబడి రాక రైతులు తీవ్రంగా నష్టపోతుంటారు. ఈ క్రమంలో రైతులకు ఉపశమనం కలిగించేలా.. పురుగులకు చెక్ పెట్టేలా దివ్య శ్రీ పత్తి, వరి, మిరప పంటలపై ప్రయోగాలు చేసింది.

పంట పొలాల్లో సౌరశక్తి ప్యానెల్..

పొలాల్లో సౌరశక్తి ప్యానెళ్లు ఏర్పాటు ద్వారా పురుగుల దాడిని అరికట్టవచ్చని భావించిన దివ్వశ్రీ, ఒక ఎకరం పొలంలో నాలుగు ప్యానెళ్లను ఏర్పాటు చేసి వాటికి బ్యాటరీతో పాటు లైట్లను అమర్చింది. దాని వలన రాత్రివేళ రెక్కల పురుగులు కాంతికి ఆకర్షితమై ఆ వేడికి తట్టుకోలేక చనిపోతాయని దివ్యశ్రీ పరిశోధనలో తేలింది. ప్యానెళ్ల కింద టబ్బు ఏర్పాటు చేయడం మూలంగా పరుగులు చనిపోయి.. అందులో పడిపోతాయని తెలిపింది. దీని తయారీకి దాదాపు రూ.7వేల వరకు ఖర్చువుతుందని, కానీ దీనిని తానే సొంతంగా తయారు చేసి, కేవలం రూ.1500లకే ఇస్తానని దివ్యశ్రీ అంటోంది. దీనిని ఒక్కసారి అమరిస్తే నాలుగు సంవత్సరాల వరకూ పనిచేస్తుందన్నారు.

దివ్యశ్రీ ప్రాజెక్టుకు JNTU గుర్తింపు

ప్రతి ఏడాది జే-హబ్ ద్వారా JNTU గుర్తించే ఐదు ఇన్నోవేటివ్ ప్రాజెక్టుల్లో ఈ ఏడాది దివ్యశ్రీ ప్రాజెక్టు చేరింది. ఆమె తయారు చేసిన ప్రాజెక్టుకు యూనివర్శిటీ ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్టు రూపకల్పనలో ప్రియదర్శిని ఇంజినీరింగ్ కళాశాల చైర్మన్ కాటేపల్లి నవీన్​బాబు సహకారం మరవలేనిదని దివ్యశ్రీ అభిప్రాయపడింది. సోమవారం దివ్యశ్రీని కళాశాల చైర్మన్​ నవీన్​బాబు, ప్రిన్సిపల్​ అట్లూరి వెంకటరమణ, హెచ్‌వోడీలు అభినందించారు.

Tags:    

Similar News