దిశ ఎఫెక్ట్ : నిఘా వర్గాల ఆరా
ఏన్కూరు మండల కేంద్రంలో పోలీస్ క్వార్టర్స్ కు మోక్షం ఎప్పుడు సీపీ గారు అంటూ సోమవారం ‘దిశ’ పేపర్ లో వార్త ప్రచురణ కావడంతో పోలీస్ క్వార్టర్స్ కోసం స్థలం ఉన్నదా,

దిశ, ఏన్కూర్: ఏన్కూరు మండల కేంద్రంలో పోలీస్ క్వార్టర్స్ కు మోక్షం ఎప్పుడు సీపీ గారు అంటూ సోమవారం ‘దిశ’ పేపర్ లో వార్త ప్రచురణ కావడంతో పోలీస్ క్వార్టర్స్ కోసం స్థలం ఉన్నదా, ఎన్ని ఎకరాల స్థలం ఉన్నది. అనే విషయాన్ని నిఘా వర్గాలు ఆరా తీశాయి. ఏన్కూర్ లో పోలీస్ స్టేషన్ వెనుక భాగంలో ఉన్న ఖాళీ స్థలంలో, ఒక ఎస్ఐ క్వార్టర్స్, రెండు ఉమెన్ కానిస్టేబుల్ క్వార్టర్స్, 13 పోలీస్ క్వార్టర్స్ నిర్మాణానికి ప్రస్తుతం ఉన్న స్థలం ఉపయోగపడుతుందని నిఘావర్గాల ద్వారా రిపోర్టు వెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికైనా పోలీస్ క్వార్టర్స్ నిర్మాణానికి మోక్షం లభించవచ్చని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.