రిలయన్స్ జియోలోకి మరో భారీ పెట్టుబడి!

ముంబయి: వరుస ఒప్పందాలతో దూసుకెళ్తున్న రిలయన్స్ జియో తాజాగా మరో పెట్టుబడిని రాబట్టింది. సౌదీఅరేబియాకి చెందిన పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ సంస్థ(పీఐఎఫ్) రూ. 11,367 కోట్ల పెట్టుబడులతో జియో ప్లాట్‌ఫామ్స్‌లో 2.32 శాతాన్ని దక్కించుకుంది. రిలయన్స్ జియో కంపెనీ 9 వారాల్లో 11 ఒప్పందాలతో మొత్తం 24.7శాతా వాటాలను విక్రయించి రూ. 1,15,693.95 కోట్ల నిధులను సేకరించగలిగింది. ప్రస్తుతం రిలయన్స్ జియో ఈక్విటీ విలువ రూ.4.91లక్షల కోట్లు ఉండగా, ఎంటర్‌ప్రైజెస్ విలువ రూ.5.16లక్షల కోట్లుగా ఉన్నట్టు కంపెనీ […]

Update: 2020-06-18 08:25 GMT

ముంబయి: వరుస ఒప్పందాలతో దూసుకెళ్తున్న రిలయన్స్ జియో తాజాగా మరో పెట్టుబడిని రాబట్టింది. సౌదీఅరేబియాకి చెందిన పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ సంస్థ(పీఐఎఫ్) రూ. 11,367 కోట్ల పెట్టుబడులతో జియో ప్లాట్‌ఫామ్స్‌లో 2.32 శాతాన్ని దక్కించుకుంది. రిలయన్స్ జియో కంపెనీ 9 వారాల్లో 11 ఒప్పందాలతో మొత్తం 24.7శాతా వాటాలను విక్రయించి రూ. 1,15,693.95 కోట్ల నిధులను సేకరించగలిగింది. ప్రస్తుతం రిలయన్స్ జియో ఈక్విటీ విలువ రూ.4.91లక్షల కోట్లు ఉండగా, ఎంటర్‌ప్రైజెస్ విలువ రూ.5.16లక్షల కోట్లుగా ఉన్నట్టు కంపెనీ వెల్లడించింది. పీఐఎఫ్ సంస్థను 1971లో స్థాపించారు. 400 బిలియన్ డాలర్లతో ప్రపంచంలో అతిపెద్ద సావరీన్ వెల్త్ ఫండ్స్‌లో ఒకటిగా ఈ సంస్థ పేరు గడించింది. సౌదీ అరేబియా ఆర్థిక వ్యవస్థలో ఈ సంస్థ ప్రధాన పాత్ర పోషిస్తున్నది. పీఐఎఫ్ సంస్థ పెట్టుబడులతో వేగవంతమైన డిజిటల్ దేశంగా ఇండియాను తీసుకెళ్లగలిగేందుకు ఇది ఉపయోగపడుతుందని రిలయన్స్ సంస్థ పేర్కొంది. అలాగే, ఇండియాను డిజిటల్ టెక్నాలజీగా ముందుకు తీసుకెళ్తున్న జియోలో పెట్టుబడులు పెట్టడం సంతోషంగా ఉందని పీఐఎఫ్ గవర్నర్ యాసీర్ అల్ రుమయన్ చెప్పారు.

Tags:    

Similar News