భారీగా పెరిగిన Jio సబ్‌స్క్రైబర్లు..
దిశ, వెబ్‌డెస్క్: భారత టెలికాం మార్కెట్లో జియో దూకుడును కొనసాగిస్తోంది. ప్రస్తుత ఏడాది జియో సంస్థ జూలై నెలకు సంబంధించి భారీగా సబ్‌స్క్రైబర్లను సాధించింది. ఎయిర్‌టెల్ సైతం మెరుగైన స్థాయిలో వినియోగదారులను సంపాదించుకుంది. అయితే, వొడాఫోన్ ఐడియా 14.3 లక్షల మంది వినియోగదారులను కోల్పోయిందని నియంత్రణ సంస్థ ట్రాయ్ తాజా గణాంకాలు వెల్లడించాయి. ముఖ్యంగా జియో సంస్థ గ్రామీణ మార్కెట్లో వినియోగదారులను పెంచుకుంది. జూలైలో రిలయన్స్ జియో కొత్తగా 65.1 లక్షల మంది సబ్‌స్క్రైబర్లను సాధించగా, భారతీ […]
దిశ, వెబ్‌డెస్క్: భారత టెలికాం మార్కెట్లో జియో దూకుడును కొనసాగిస్తోంది. ప్రస్తుత ఏడాది జియో సంస్థ జూలై నెలకు సంబంధించి భారీగా సబ్‌స్క్రైబర్లను సాధించింది. ఎయిర్‌టెల్ సైతం మెరుగైన స్థాయిలో వినియోగదారులను సంపాదించుకుంది. అయితే, వొడాఫోన్ ఐడియా 14.3 లక్షల మంది వినియోగదారులను కోల్పోయిందని నియంత్రణ సంస్థ ట్రాయ్ తాజా గణాంకాలు వెల్లడించాయి. ముఖ్యంగా జియో సంస్థ గ్రామీణ మార్కెట్లో వినియోగదారులను పెంచుకుంది.
జూలైలో రిలయన్స్ జియో కొత్తగా 65.1 లక్షల మంది సబ్‌స్క్రైబర్లను సాధించగా, భారతీ ఎయిర్‌టెల్‌కు 19.42 లక్షల మంది వినియోగదారులు పెరిగారు. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) నెలవారీ నివేదిక ప్రకారం.. జూలై నెలలో రిలయన్స్ జియో వినియోగదారులు భారీగా పెరగడంతో కంపెనీ మొత్తం సబ్‌స్క్రైబర్లు సంఖ్య 44.32 కోట్లకు పెరిగింది. ఎయిర్‌టెల్ వినియోగదారుల సంఖ్య 35.30 కోట్లకు చేరుకుంది. వొడాఫోన్ ఐడియా సబ్‌స్క్రైబర్లు తగ్గడంతో మొత్తం వినియోగదారుల సంఖ్య 27.19 కోట్లకు పడిపోయింది.