రేపే జెఫ్ బెజోస్ అండ్ టీం అంతరిక్ష ప్రయాణం..
న్యూఢిల్లీ : అంతరిక్ష పర్యాటకంపై కంపెనీల మధ్య రేసు ప్రారంభం కాబోతున్నది. ఇటీవలే వర్జిన్ గెలాక్టిక్ నలుగురు సిబ్బందితో తొలిసారి రోదసి పర్యాటకానికి కీలక అడుగులు వేయగా, తాజాగా కుబేరుడు జెఫ్ బెజోస్ కలల ప్రాజెక్టు రేపు సాకారం కాబోతున్నది. 2000లో తాను స్థాపించిన బ్లూ ఆరిజిన్ మంగళవారం సాయంత్రం 6.30 గంటలకు న్యూ షెపర్డ్ రాకెట్‌ను నింగిలోకి పంపనుంది. ఇందులో జెఫ్ బెజోస్, తన సోదరుడు మార్క్ బెజోస్‌లు వెళ్లనున్నారు. వీరితోపాటు అత్యంత వృద్ధ వ్యోమగామిగా […]
న్యూఢిల్లీ : అంతరిక్ష పర్యాటకంపై కంపెనీల మధ్య రేసు ప్రారంభం కాబోతున్నది. ఇటీవలే వర్జిన్ గెలాక్టిక్ నలుగురు సిబ్బందితో తొలిసారి రోదసి పర్యాటకానికి కీలక అడుగులు వేయగా, తాజాగా కుబేరుడు జెఫ్ బెజోస్ కలల ప్రాజెక్టు రేపు సాకారం కాబోతున్నది. 2000లో తాను స్థాపించిన బ్లూ ఆరిజిన్ మంగళవారం సాయంత్రం 6.30 గంటలకు న్యూ షెపర్డ్ రాకెట్‌ను నింగిలోకి పంపనుంది. ఇందులో జెఫ్ బెజోస్, తన సోదరుడు మార్క్ బెజోస్‌లు వెళ్లనున్నారు. వీరితోపాటు అత్యంత వృద్ధ వ్యోమగామిగా నిలవనున్న 82ఏళ్ల వాలి ఫంక్, 18 ఏళ్ల ఒలివర్ డెమెన్ యువ ఆస్ట్రోనాట్‌గా రికార్డు తిరగరాస్తూ రోదసిలోకి దూసుకెళ్లనున్నారు.
టెక్సాస్‌లోని వాన్ హార్న్‌లోని కంపెనీ లాంచ్ సైట్ నుంచి ఈ స్పేస్ క్యాప్సుల్‌ను తీసుకెళ్లే రాకెట్‌ను బ్లూ ఆరిజిన్ ప్రవేశపెట్టనుంది. భారత కాలమానం ప్రకారం, సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో లాంచింగ్ ఉంటుంది. బ్లూ ఆరిజిన్ వెబ్‌సైట్‌లో లైవ్ టెలికాస్ట్ ప్రసారం కానుంది. ఈ స్పేస్ క్యాప్సుల్ నలుగురు ప్రయాణికులను అంతరిక్షాన్ని, భూ ఆవరణాన్ని వేరుచేసే కర్మాన్ రేఖను దాటించి తిరిగి భూమిపైకి చేర్చనుంది. వర్జిన్ గెలాక్టిక్ ప్రాజెక్టులో పంపిన స్పేస్ షిప్ భూమి నుంచి 100 కిలోమీటర్ల ఎత్తులో ఉండే కర్మాన్ రేఖను దాటలేదు. కొన్ని నిమిషాలు గురుత్వాకర్షణ శక్తి లేమిని అనుభవించినప్పటికీ కర్మాన్ రేఖను దాటలేదు. అయితే, ఆ ఎత్తును రోదసిగా అమెరికా గుర్తిస్తుంది.