రెండేళ్లు నరేశ్‌తో ట్రావెల్‌ చేశా.. అలా చేయడమే మా తప్పు: జీవిత

దిశ, వెబ్‌డెస్క్: మా ఎన్నికలు టాలీవుడ్‌‌లో హాట్ టాపిక్‌గా మారిన వేళ జీవిత రాజశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండేళ్లు నరేశ్‌తో కలిసి ట్రావెల్ చేసి.. ఆయన చెప్పిన మాట వినడమే తప్పు అయిందని జీవిత రాజశేఖర్ బాంబు పేల్చారు. నరేశ్ గతేడాది వచ్చి ‘మా’ లో చాలా అన్యాయం జరుగుతోందని చెప్పారన్నారు. అది నిజమనే నమ్మి.. నరేశ్‌ను వ్యతిరేకించిన వారిపై కూడా మేము ఫైర్ అయ్యామన్నారు. కానీ, అది ఎంత బుద్ధి తక్కువ పనో తర్వాత అర్థమైందన్నారు. […]

Update: 2021-10-04 05:45 GMT

దిశ, వెబ్‌డెస్క్: మా ఎన్నికలు టాలీవుడ్‌‌లో హాట్ టాపిక్‌గా మారిన వేళ జీవిత రాజశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండేళ్లు నరేశ్‌తో కలిసి ట్రావెల్ చేసి.. ఆయన చెప్పిన మాట వినడమే తప్పు అయిందని జీవిత రాజశేఖర్ బాంబు పేల్చారు. నరేశ్ గతేడాది వచ్చి ‘మా’ లో చాలా అన్యాయం జరుగుతోందని చెప్పారన్నారు. అది నిజమనే నమ్మి.. నరేశ్‌ను వ్యతిరేకించిన వారిపై కూడా మేము ఫైర్ అయ్యామన్నారు. కానీ, అది ఎంత బుద్ధి తక్కువ పనో తర్వాత అర్థమైందన్నారు. తప్పులు చేయకుండా ఎవరూ ఉండరని.. తప్పులు సరిదిద్దుకోవడానికి భగవంతుడు అవకాశం ఇస్తాడు.. ఈ ప్రయత్నంలో నరేశ్‌కు మాకు విబేధాలు వచ్చాయని తెలిపారు.

నిజానికి రెండేళ్లు ప్యానెల్‌‌లో నరేశ్‌తో కలిసి ట్రావెల్ చేశానని.. తన పక్కనే ఉండి అన్ని నిర్ణయాలు తీసుకున్నట్టు జీవిత క్లారిటీ ఇచ్చారు. అందరినీ కలుపుకోవాలని ప్రయత్నించినా.. నరేశ్ అందుకు సహకరించలేదన్నారు. ‘మా’ కోసం మూడు సార్లు ఈసీ మీటింగ్ పెడితే.. పెద్ద రచ్చ జరిగిందని.. కొట్టుకోవడం ఒక్కటే తక్కువైందని జీవిత కుండ బద్ధలు కొట్టారు. ఇటువంటి సమయంలో కూడా జీవిత రాజశేఖర్‌లు గొడవను అడ్డుకున్నారన్నారు. మంచి చేయాలనుకోవడమే మేము చేసిన తప్పా అంటూ మీడియాతో ఆవేదన వ్యక్తం చేశారు.

24 గంటలు మీడియా చుట్టు బండ్ల..

బండ్ల గణేష్ తనపై ఆరోపణలు చేయడానికి 24 గంటల పాటు మీడియా చానళ్ల చుట్టూ తిరిగారని.. పృథ్వీ కూడా తనపై ఆరోపణలు చేశారన్నారు జీవిత. అయినా, ఈ విషయాలను పక్కన బెట్టి సైలెంట్‌గా ఉంటే సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. మావీ అసోసియేషన్‌లో జీవిత రాజశేఖర్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని.. ఎలక్షన్ క్యాంపెయినింగ్ కోసం అధికారాన్ని వాడుకుంటున్నారని.. టెంపరరీ కార్డ్స్ ఇస్తూ మెంబర్లను మభ్యపెడుతున్నట్టు తనపై అభియోగాలు మోపారని.. ఇదంతా హాస్యాస్పదంగా ఉందని జీవిత చెప్పారు. అయినా ప్రపంచంలో ఎవరూ లేనట్టుగా మా ఎన్నికల్లో ఎప్పుడూ జీవిత రాజశేఖర్‌లను టార్గెట్ చేసే అవసరం ఏముంది అంటూ ఆమె ప్రశ్నించారు. మంచి చేయాలనుకోవడమే మేము చేసిన తప్పా అంటూ నిలదీశారు.

Tags:    

Similar News