స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై హైకోర్టులో పిటిషన్
దిశ, వెబ్‌డెస్క్: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏపీ హైకోర్టులో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పిటిషన్ దాఖలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా ఆదేశించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై రేపు విచారణ జరిగే అవకాశముంది. ఇటీవల విశాఖ ఉక్కు ఉద్యమంపై టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌తో లక్ష్మీనారాయణ చర్చలు జరిపారు. అనంతరం ఈ పిటిషన్ దాఖలు చేయడం చర్చనీయాంశమైంది. కాగా […]
దిశ, వెబ్‌డెస్క్: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏపీ హైకోర్టులో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పిటిషన్ దాఖలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా ఆదేశించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై రేపు విచారణ జరిగే అవకాశముంది.
ఇటీవల విశాఖ ఉక్కు ఉద్యమంపై టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌తో లక్ష్మీనారాయణ చర్చలు జరిపారు. అనంతరం ఈ పిటిషన్ దాఖలు చేయడం చర్చనీయాంశమైంది.
కాగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇప్పటికే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పెండింగ్‌లో ఉండగా.. లక్ష్మీనారాయణ మరో పిటిషన్ దాఖలు చేశారు.