పెళ్లైనా కూడా పోలీస్ శాఖలో పనిచేస్తున్న యువతితో ప్రేమాయణం.. గర్భం దాల్చడంతో..
దిశ, వెబ్ డెస్క్: పోలీస్ శాఖలో పని చేస్తున్న యువతితో ప్రేమాయణం కొనసాగించిన ఓ ప్రజాప్రతినిధి కుమారుడు.. ఆమె గర్భం దాల్చడంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకలోని మైసూరుకు చెందిన జేడీఎస్ నాయకుడు శివమూర్తి కుమారుడు ప్రదీప్(32) తన భార్యాపిల్లలతో కలిసి నగరంలోని మరటిక్యాతనహళ్లిలోని ఓ అపార్ట్ మెంట్ లో ఉంటున్నాడు. అయితే, మైసూరులోని పోలీస్ శాఖలో పని చేస్తున్న ఓ యువతితో […]
దిశ, వెబ్ డెస్క్: పోలీస్ శాఖలో పని చేస్తున్న యువతితో ప్రేమాయణం కొనసాగించిన ఓ ప్రజాప్రతినిధి కుమారుడు.. ఆమె గర్భం దాల్చడంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకలోని మైసూరుకు చెందిన జేడీఎస్ నాయకుడు శివమూర్తి కుమారుడు ప్రదీప్(32) తన భార్యాపిల్లలతో కలిసి నగరంలోని మరటిక్యాతనహళ్లిలోని ఓ అపార్ట్ మెంట్ లో ఉంటున్నాడు. అయితే, మైసూరులోని పోలీస్ శాఖలో పని చేస్తున్న ఓ యువతితో పరిచయం ఏర్పడింది. అది కాస్త వారి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీంతో ఆ యువతి గర్భం దాల్చింది. దీంతో తనని పెళ్లి చేసుకోవాలని ఆ యువతి ప్రదీప్ పై ఒత్తిడి తెచ్చింది. దీంతో తనకు పెళ్లై ఇద్దరు పిల్లలున్నారు.. తాను చేసుకోలేనని చెప్పి నిరాకరించాడు. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య గొడవ జరిగినట్లు సమాచారం. అక్కడి నుంచి నేరుగా అతను ఇంటికి వచ్చి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకంటే ముందు ఆ యువతికి వీడియో కాల్ చేశాడని సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.