వాహనదారులకు గుడ్ న్యూస్.. ఈ హెల్మెట్స్ వాడితో జుట్టు ఊడిపోదు..!
దిశ, డైనమిక్ బ్యూరో: వాహనదారులు రోడ్డెక్కితే హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి. తాజాగా కేంద్రం తెచ్చిన మార్గదర్శకాలతో డ్రైవింగ్ చేసే వారితో పాటు వెనక కూర్చున్నవారు కూడా హెల్మెట్ ధరించాల్సిందే. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలతో చలాన్ల నుంచి తప్పించుకునేందుకు మాత్రమే యువత హెల్మెట్ వినియోగిస్తున్నారు. ఇక కొందరైతే హెల్మెట్ పెట్టుకుంటే జుట్టు రాలిపోతుందనే భయంతో ఫైన్ కట్టేందుకు వెనుకాడటం లేదు. వాస్తవానికి హెల్మెట్ ధరించడం వల్ల జుట్టు రాలడం సహజమే.. కానీ, జుట్టుకోసం ప్రాణాలను పణంగా పెడుతారా అని […]
దిశ, డైనమిక్ బ్యూరో: వాహనదారులు రోడ్డెక్కితే హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి. తాజాగా కేంద్రం తెచ్చిన మార్గదర్శకాలతో డ్రైవింగ్ చేసే వారితో పాటు వెనక కూర్చున్నవారు కూడా హెల్మెట్ ధరించాల్సిందే. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలతో చలాన్ల నుంచి తప్పించుకునేందుకు మాత్రమే యువత హెల్మెట్ వినియోగిస్తున్నారు. ఇక కొందరైతే హెల్మెట్ పెట్టుకుంటే జుట్టు రాలిపోతుందనే భయంతో ఫైన్ కట్టేందుకు వెనుకాడటం లేదు. వాస్తవానికి హెల్మెట్ ధరించడం వల్ల జుట్టు రాలడం సహజమే.. కానీ, జుట్టుకోసం ప్రాణాలను పణంగా పెడుతారా అని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
ఇక హెల్మెట్ పెట్టుకున్నా జుట్టు రాలిపోకుండా ఉండేలా స్పెషల్ హెల్మెట్ కోసం ఎదురుచూస్తున్నవారికి హైదరాబాద్ కుర్రాళ్లు గుడ్ న్యూస్ చెప్పారు. నగరానికి చెందిన కౌస్తుభ్ కౌండిన్య, శ్రీకాంత్ కొమ్ముల, ఆనంద్ కుమార్ అనే ముగ్గురు యువకులు ఏసీ హెల్మెట్‌ను రూపొందించారు. దీనిని దుబాయ్‌లో జరుగుతోన్న ‘Expo 2020 Dubai’లో ‘ప్రపంచంలోనే తొలి ఏసీ హెల్మెట్’గా ఆవిష్కరించారు. హైదరాబాద్ స్టార్టప్ ‘జర్ష్ సేఫ్టీ’ రూపొందించిన ఏసీ హెల్మెట్‌లో (inside) ప్రతినిత్యం 24 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండేలా రూపొందించారు.
ఈ ఏసీ హెల్మెట్‌ను వాహనదారులతో పాటు నిర్మాణ రంగంలో పనిచేసే వాళ్లు కూడా ధరించవచ్చు. ప్రస్తుతం ఈ ఏసీ హెల్మెట్‌లు మూడు మోడల్స్‌లో అందుబాటులోకి వచ్చాయి. వీటి బరువు 650 గ్రాముల నుంచి 1కేజీ వరకు ఉంటుంది. ఏసీ హెల్మెట్ల ధర మోడళ్లను బట్టి రూ.6 వేల నుంచి రూ.10వేల దాకా ఉంటుంది. జర్ష్ సేఫ్టీ వెబ్ సైట్లలో ఈ హెల్మెట్‌ను కొనుగోలు చేయవచ్చు.
How to keep your head cool.. Here comes the world’s first air conditioned helmet by Jarsh Safety an Indian company. The product is on display at the #indiapavillion at the @expo2020dubai @hvgoenka @ValaAfshar pic.twitter.com/JqOnwnCeR5
— Dinesh Joshi (@officeofdnj) November 12, 2021