ప్రపంచంలో అత్యంత వేగవంతమైన కంప్యూటర్ ఇదే!

ఇప్పటివరకు ప్రపంచంలో అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్ అంటే చైనానో, అమెరికానో గుర్తొచ్చేది. కానీ ఇప్పుడు ఆ రెండు దేశాలను దాటేసి జపాన్ మొదటిస్థానంలో నిలిచింది. ‘ఫుగాకు’ అని పిలిచే సూపర్ కంప్యూటర్‌ను కోబీ నగరంలోని రికెన్ ఇనిస్టిట్యూట్‌లో అమర్చారు. సంవత్సరానికి రెండు సార్లు జరిగే సూపర్ కంప్యూటర్ ర్యాంకింగ్ రేసులో ఈసారి జపాన్ కంప్యూటర్ నిలిచింది. రెండో స్థానంలో ఉన్న అమెరికాలోని టెన్నేసే వారి ఓక్ రిడ్జ్ నేషనల్ లేబొరేటరీ సూపర్ కంప్యూటర్ కంటే 2.8 […]

Update: 2020-06-23 03:26 GMT

ఇప్పటివరకు ప్రపంచంలో అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్ అంటే చైనానో, అమెరికానో గుర్తొచ్చేది. కానీ ఇప్పుడు ఆ రెండు దేశాలను దాటేసి జపాన్ మొదటిస్థానంలో నిలిచింది. ‘ఫుగాకు’ అని పిలిచే సూపర్ కంప్యూటర్‌ను కోబీ నగరంలోని రికెన్ ఇనిస్టిట్యూట్‌లో అమర్చారు. సంవత్సరానికి రెండు సార్లు జరిగే సూపర్ కంప్యూటర్ ర్యాంకింగ్ రేసులో ఈసారి జపాన్ కంప్యూటర్ నిలిచింది. రెండో స్థానంలో ఉన్న అమెరికాలోని టెన్నేసే వారి ఓక్ రిడ్జ్ నేషనల్ లేబొరేటరీ సూపర్ కంప్యూటర్ కంటే 2.8 రెట్లు వేగంగా పనిచేసి ఫుగాకు మొదటిస్థానం దక్కించుకుంది. ఇక మూడో స్థానంలో కాలిఫోర్నియాకు చెందిన లారెన్స్ లివర్‌మోర్ నేషనల్ లేబొరేటరీ ఐబీఎం సిస్టమ్ నిలిచింది. ఇక నాలుగు, ఐదు స్థానాల్లో చైనాకు చెందిన కంప్యూటర్లు నిలిచాయి.

ఆర్థిక, సాంకేతిక రంగాల్లో సూపర్ కంప్యూటర్లను కలిగి ఉండటం అనేది ప్రపంచ దేశాలకు ఒక స్టేటస్ సింబల్‌గా మారింది. ఒక గది స్థలాన్ని ఆక్రమించే ఈ సూపర్ కంప్యూటర్లు సంక్లిష్ట మిలిటరీ, సాంకేతిక సమస్యలను కొన్ని క్షణాల్లో పరిష్కరించగలుగుతున్నాయి. విదేశీ హ్యాకర్ల కోడ్ బ్రేక్ చేయడం నుంచి వాతావరణ మార్పులు పసిగట్టడం, కార్లు, యుద్ధనౌకలు డిజైన్ చేయడం వరకు వివిధ ఉపయోగకర పనులన్నింటికీ ఈ సూపర్ కంప్యూటర్లు
ఉపయోగపడుతున్నాయి. ఇప్పటికే ఈ ఫుగాకు కంప్యూటర్ కొవిడ్ 19 గురించి పరిశోధించడంలో చాలా సాయపడిందని రికెన్ ఇనిస్టిట్యూట్ ఒక ప్రకటనలో తెలిపింది. టాప్ 500 సూపర్ కంప్యూటర్ల జాబితాలో చైనాకు చెందిన 226, అమెరికాకు చెందినవి 114 ఉన్నాయి. వీటన్నింటినీ దాటేసి జపాన్ కంప్యూటర్ మొదటిస్థానంలో నిలవడం నిజంగా గర్వకారణమని రికెన్ పేర్కొంది.

Tags:    

Similar News