జనసేన పార్టీపై పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
దిశ, ఏపీ బ్యూరో: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితిలో జనసేన పార్టీ నడపడం సాహసోపేతమైన చర్యగా అభివర్ణించారు. ఎన్ని కష్టాలు ఎదురైనా జనసేన జనంతోనే ఉంటుందని స్పష్టం చేశారు. మీ అందరి ఆదరాభిమానాలతో ప్రజలకు మరింత సేవ చేద్దామన్నారు. అమరావతిలోని జనసేన పార్టీ సమావేశంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్, కరోనాతో మృతి చెందిన వారికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నంద్యాలలో మృతి చెందిన జనసేన కార్యకర్త ఆకుల […]
దిశ, ఏపీ బ్యూరో: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితిలో జనసేన పార్టీ నడపడం సాహసోపేతమైన చర్యగా అభివర్ణించారు. ఎన్ని కష్టాలు ఎదురైనా జనసేన జనంతోనే ఉంటుందని స్పష్టం చేశారు. మీ అందరి ఆదరాభిమానాలతో ప్రజలకు మరింత సేవ చేద్దామన్నారు. అమరావతిలోని జనసేన పార్టీ సమావేశంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్, కరోనాతో మృతి చెందిన వారికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నంద్యాలలో మృతి చెందిన జనసేన కార్యకర్త ఆకుల సోమేశ్ కుటుంబ సభ్యులకు రూ.5లక్షల చెక్‌ను పవన్ కళ్యాణ్ అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారి కారణంగా ఎంతో మంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మహమ్మారి వల్ల జన సైనికులను కోల్పోవడం వ్యక్తిగతంగా తీవ్ర ఇబ్బంది కలిగించిందన్నారు. ఈ కష్టకాలంలో జన సైనికులు ఎంతో మంది సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారని వారందరికీ అభినందనలు తెలియజేశారు. పార్టీ తరపున లక్ష మంది కార్యకర్తలకు బీమా సౌకర్యం కల్పించినట్లు పవన్ తెలిపారు. ఈ బీమా పథకానికి తన వంతుగా కోటి రూపాయలు ఇచ్చినట్లు పవన్ వివరించారు. ప్రజా స్వామ్య విలువలను కాపాడటానికి జనసేన ఎప్పుడూ కృషి చేస్తుందని పవన్ కళ్యాణ్ తెలిపారు.