RRR పట్ల ప్రభుత్వ తీరుపై లోక్‌సభ స్పీకర్‌కు జనసేన రిక్వెస్ట్

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఇటీవల అరెస్టై సీఐడీ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. అయతే.. శనివారం పోలీసులు థర్డ్ డిగ్రీ ఉపయోగించి చితకబాదినట్టు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. దీనిపై తాజాగా.. జ‌న‌సేన పార్టీ స్పందించింది. ర‌ఘు రామ‌కృష్ణం రాజు పట్ల ప్రభుత్వం ప్రవర్తిస్తున్న తీరును ఖండించింది. ఈ మేరకు జనసేన పార్టీ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటన విడుదల చేశారు. ‘‘ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నరసాపురం ఎంపీ రఘు […]

Update: 2021-05-16 03:21 GMT

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఇటీవల అరెస్టై సీఐడీ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. అయతే.. శనివారం పోలీసులు థర్డ్ డిగ్రీ ఉపయోగించి చితకబాదినట్టు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. దీనిపై తాజాగా.. జ‌న‌సేన పార్టీ స్పందించింది. ర‌ఘు రామ‌కృష్ణం రాజు పట్ల ప్రభుత్వం ప్రవర్తిస్తున్న తీరును ఖండించింది. ఈ మేరకు జనసేన పార్టీ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటన విడుదల చేశారు. ‘‘ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నరసాపురం ఎంపీ రఘు రామకృష్ణం రాజు విషయంలో వ్యవహరించిన తీరును ప్రజాస్వామ్య విలువలపై విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరూ గ‌ర్హించాలి. ప్రజలు ఎన్నుకున్న చట్టసభ సభ్యుడి పట్ల అధికారుల తీరును జనసేన పార్టీ ఖండిస్తోంది.

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి లోబడి వ్యవహరించడం అధికారుల బాధ్యత అని.. ఒక ఎంపీ కావచ్చు ఒక సాధారణ పౌరుడు కావచ్చు.. ఎవరి పట్లా విచారణ పేరుతో అనుచితంగా వ్యవహరించకూడదని చట్టం చెబుతోంది. రఘు రామకృష్ణం రాజుకి లోక్ సభ సభ్యుడిగా ఉండే హక్కులను కాలరాసినట్లు అర్థం అవుతోంది. ఒక లోక్ సభ సభ్యుడి విషయంలోనే హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారు అంటే సామాన్యుల పరిస్థితి ఏమిటి?. ఈ వ్యవస్థను సరిచేసే అధికారం చట్టసభలకు ఉంటుంది.

రఘు రామకృష్ణ రాజు విషయంలో ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును లోక్ సభ స్పీకర్ సుమోటోగా తీసుకొని విచారణకు ఆదేశించాలి. బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్‌గా లోక్ సభ స్పీకర్ గుర్తించాలి. ఇందుకు కారకులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకొనే విశేష అధికారం పార్లమెంటుకు ఉంది. ఈ అధికారాన్ని ఉపయోగించకపోతే చట్ట సభలకు ఉన్న ప్రాధాన్యత, విశిష్టతకు భంగం వాటిల్లే అవకాశం ఉంది. ఈ అంశాలపై పార్లమెంట్ సభ్యుల సహకారంతో లోక్ సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా గారికి జనసేన లేఖ రాస్తుంది.’’ అని జనసేన నేత నాదెండ్ల మనోహర్ చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News