రేపు రామతీర్ధానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్

దిశ, విశాఖపట్నం : విజయనగరం జిల్లా రామతీర్ధం ఆలయంలోని విగ్రహాలను ధ్వంసం చేసిన ప్రాంతానికి ధర్మపోరాట యాత్ర పేరటి ఈ నెల 5న చేపట్టనున్నారు. దీనిలో భాగంగా జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌, ప్రధాన కార్యదర్శులు శివశంకర్‌, బొలిశెట్టి సత్యనారాయణతో పాటు,బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఇతర నాయకులు హాజరవుతారని బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్‌ మాధవ్‌ తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉత్తరాంధ్ర జిల్లాలోని బీజేపీ,జనసేన,రామ భక్తులు తరలిరావాలని కోరారు.అయితే ఇప్పటికే అధికార,ప్రతిపక్ష పార్టీల నాయకులతో రణరంగంగా మారిన […]

Update: 2021-01-04 10:12 GMT

దిశ, విశాఖపట్నం : విజయనగరం జిల్లా రామతీర్ధం ఆలయంలోని విగ్రహాలను ధ్వంసం చేసిన ప్రాంతానికి ధర్మపోరాట యాత్ర పేరటి ఈ నెల 5న చేపట్టనున్నారు. దీనిలో భాగంగా జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌, ప్రధాన కార్యదర్శులు శివశంకర్‌, బొలిశెట్టి సత్యనారాయణతో పాటు,బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఇతర నాయకులు హాజరవుతారని బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్‌ మాధవ్‌ తెలిపారు.

ఈ కార్యక్రమానికి ఉత్తరాంధ్ర జిల్లాలోని బీజేపీ,జనసేన,రామ భక్తులు తరలిరావాలని కోరారు.అయితే ఇప్పటికే అధికార,ప్రతిపక్ష పార్టీల నాయకులతో రణరంగంగా మారిన రామతీర్ధం జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ పర్యటన నేపథ్యంలో పోలీసులు మరింత కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు.

 

Tags:    

Similar News