భారత జాతిని అమామానించినట్టే : జనసేన

దిశ, వెబ్‌డెస్క్: తూర్పు గోదావరి జిల్లా చింతలపూడిలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి జరిగిన అవమానంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అంబేద్కర్ విగ్రహం మెడలో సంఘ విద్రోహశక్తులు చెప్పుల దండ వేయడం తీవ్రమై దుశ్చర్యగా పరిగణించారు. రాజ్యాంగ నిర్మాత అయినటువంటి ఆ మహనీయుడిని అవమానించడం అంటే.. భారత జాతిని అవమానించినట్ట అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దేశానికి దశ-దిశ […]

Update: 2021-02-01 04:55 GMT

దిశ, వెబ్‌డెస్క్: తూర్పు గోదావరి జిల్లా చింతలపూడిలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి జరిగిన అవమానంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అంబేద్కర్ విగ్రహం మెడలో సంఘ విద్రోహశక్తులు చెప్పుల దండ వేయడం తీవ్రమై దుశ్చర్యగా పరిగణించారు. రాజ్యాంగ నిర్మాత అయినటువంటి ఆ మహనీయుడిని అవమానించడం అంటే.. భారత జాతిని అవమానించినట్ట అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దేశానికి దశ-దిశ చూపిన మహోన్నత వ్యక్తికి మనం ఇచ్చే గౌరవం ఇదా? అని ప్రశ్నించారు. అంతేగాకుండా.. ఈ దారుణం జరిగి 36 గంటలు దాటుతున్నా.. రాష్ట్ర ప్రభుత్వం నిందితులను పట్టించుకోకపోవడం పెద్ద తప్పు అని అభిప్రాయపడ్డారు. దోషులకు శిక్షపడేంత వరకూ జనసేన ఆద్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు.

Tags:    

Similar News