దాడులకు జగన్ బాధ్యత వహించాలి : పవన్
ఎన్నికల ప్రక్రియ కాదు.. నామినేషన్ ప్రక్రియను రద్దు చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. దౌర్జన్యకరంగా నామినేషన్ ప్రక్రియ ఏకపక్షంగా జరిగాయని ఆయన విమర్శించారు. ఎన్నికలు ఆప్యాయంగా జరగాలని తెలిపారు. మేం చెప్పినట్టే రాష్ర్టంలో హింస, దౌర్జన్యాలు పెరిగిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకుల గూండాయిజం వల్ల చిత్తూరు జిల్లాలో నామినేషన్‌లు వేసేందుకు అభ్యర్థులు భయపడుతున్నారన్నారు. రాష్ర్టంలో జరిగిన దౌర్జన్యకాండను సీఎం జగన్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రాష్ర్టంలో ఇన్ని దాడులు జరుగుతున్నా.. […]
ఎన్నికల ప్రక్రియ కాదు.. నామినేషన్ ప్రక్రియను రద్దు చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. దౌర్జన్యకరంగా నామినేషన్ ప్రక్రియ ఏకపక్షంగా జరిగాయని ఆయన విమర్శించారు. ఎన్నికలు ఆప్యాయంగా జరగాలని తెలిపారు. మేం చెప్పినట్టే రాష్ర్టంలో హింస, దౌర్జన్యాలు పెరిగిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకుల గూండాయిజం వల్ల చిత్తూరు జిల్లాలో నామినేషన్‌లు వేసేందుకు అభ్యర్థులు భయపడుతున్నారన్నారు. రాష్ర్టంలో జరిగిన దౌర్జన్యకాండను సీఎం జగన్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రాష్ర్టంలో ఇన్ని దాడులు జరుగుతున్నా.. ఈసీ ఏమీ జరుగనట్టు వ్యవహరించడం ఆందోళనకరం అన్నారు. రాష్ర్ట ఎన్నికల కమిషన్ ప్రభుత్వానికి కొమ్ముకాస్తోందని మండిపడ్డారు. ఇలాగే భౌతిక దాడులకు దిగితే చూస్తూ ఊరుకోం అని హెచ్చరించారు. ఈ విషయమై కేంద్ర హోంశాఖకు లేఖ రాస్తున్నామని తెలిపారు. చీఫ్ ఎలక్షన్ కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు.
Tags: pawan kalyan, cm jagan, janasena, Election Commission, Violence have increased in the state