జనసేనాని నిర్ణయంతో బీజేపీలో టెన్షన్.. మద్దతు ప్రశ్నార్ధకమే.!

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో బద్వేల్ ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. కడప జిల్లా బద్వేల్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య అకాల మరణంతో నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. దీంతో ఇప్పటికే రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు కసరత్తు మొదలెట్టాయి. ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. అంతేగాకుండా.. బద్వేల్ ఉప ఎన్నికకు టీడీపీ అభ్యర్థిని ప్రకటించిన అధినేత చంద్రబాబు ఇప్పటికే రంగంలోకి దిగి గెలుపే లక్ష్యంగా ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే.. ఉప […]

Update: 2021-10-02 22:22 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో బద్వేల్ ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. కడప జిల్లా బద్వేల్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య అకాల మరణంతో నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. దీంతో ఇప్పటికే రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు కసరత్తు మొదలెట్టాయి. ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. అంతేగాకుండా.. బద్వేల్ ఉప ఎన్నికకు టీడీపీ అభ్యర్థిని ప్రకటించిన అధినేత చంద్రబాబు ఇప్పటికే రంగంలోకి దిగి గెలుపే లక్ష్యంగా ప్రయత్నాలు ప్రారంభించారు.

అయితే.. ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఏపీలో బీజేపీ పోటీ చేసేందుకు సిద్ధమౌతోంది. ఈ నేపథ్యంలో బీజేపీకి జనసేన అనూహ్య షాక్ ఇచ్చింది. బద్వేలు ఉప ఎన్నిక బరి నుంచి జనసేన నిన్న తప్పుకుంది. ఈ మేరకు శనివారం నిర్వహించిన బహిరంగ సభలో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఈ క్రమంలో బద్వేలులో పోటీకి దిగేందుకు సిద్ధం కాబోతున్న బీజేపీకి తన మిత్రపక్షమైన జనసేనాని వ్యాఖ్యల నేపథ్యంలో మద్దతు ప్రశ్నర్ధకమే అనిపిస్తోంది. దీంతో బీజేపీలో ఇబ్బందికర వాతావరణం తలెత్తే అవకాశం కనిపిస్తోంది.

గతకొద్ది రోజుల నుంచి బ‌ద్వేల్ ఉప ఎన్నిక‌లో పోటీ చేయాలని తనపై భారీగా ఒత్తిడి వ‌చ్చింద‌ని.. అయినా కాని చ‌నిపోయిన వ్యక్తి స‌తీమ‌ణిని గౌర‌విస్తూ పోటీ నుంచి త‌ప్పుకుంటున్నామ‌ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న కుండబద్దలు కొట్టారు. ఎన్నిక‌ను ఏక‌గ్రీవం చేసుకోవాల‌ని కోరుతున్నట్టు కూడా ప‌వ‌న్ వెల్లడించారు. ఈ ఉప ఎన్నిక‌లో గ‌ట్టి పోటీ ఉంటుంద‌ని అనుకున్నా, ప‌వ‌న్ కీల‌క నిర్ణయం తీసుకోవ‌డంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. మరి చివరకు జనసేనాని మద్దతు ఎవరికి ఉంటుందో చూడాలి.

Tags:    

Similar News