మాతృభాషలోనే బోధన జయప్రదం: పవన్
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆమోదం తెలిపిన నూతన విద్యా విధానాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వాగతించారు. పదో తరగతి వరకు విద్యా బోధన మాతృ భాషలోనే జరగాలని నూతన విద్యా విధానంలో నిర్ణయించడం హర్షనీయమన్నారు. గతంలో ఏపీ ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నప్పుడే జనసేన వ్యతిరేకించిందని పవన్ గుర్తు చేశారు. అపార అనుభవం ఉన్న నిపుణులతో కలిసి కేంద్రం బాధ్యతాయుతమైన నిర్ణయం తీసుకున్నదని జనసేనాని తెలిపారు. మాతృభాషలోనే బోధన […]
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆమోదం తెలిపిన నూతన విద్యా విధానాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వాగతించారు. పదో తరగతి వరకు విద్యా బోధన మాతృ భాషలోనే జరగాలని నూతన విద్యా విధానంలో నిర్ణయించడం హర్షనీయమన్నారు. గతంలో ఏపీ ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నప్పుడే జనసేన వ్యతిరేకించిందని పవన్ గుర్తు చేశారు.
అపార అనుభవం ఉన్న నిపుణులతో కలిసి కేంద్రం బాధ్యతాయుతమైన నిర్ణయం తీసుకున్నదని జనసేనాని తెలిపారు. మాతృభాషలోనే బోధన జరిగినప్పుడు గొప్ప ఫలితాలు ఆవిష్కృతమవుతాయని ఐక్యరాజ్యసమితికి అనుబంధమైన యూనెస్కో 2008తో స్పష్టం చేసిందని గుర్తు చేశారు. నూతన విద్యా విధానం తనకు ఆనందాన్ని కలిగించిందని పవన్ వ్యాఖ్యానించారు. కొవిడ్ మహమ్మారి సద్దుమణిగాక ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని.. ప్రాథమిక విద్యాబోధన మాతృ భాషాలోనే ఉండాలని నిర్ణయించిన కమిటీ సభ్యులకు, ప్రధాని మోదీకి పవన్ ధన్యవాదాలు తెలియజేశారు.