హోం మత్రి అమిత్ షాతో జనసేనాని భేటీ

దిశ, వెబ్‌డెస్క్: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయమై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మంగళవారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా-తెలుగు వారి ఆత్మగౌరవానికి, ఆకాంక్షలకు ప్రతీక అయిన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకొనే అంశంపై చర్చించిన్నట్లు సమాచారం. బుధవారం బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డాతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయం […]

Update: 2021-02-09 10:34 GMT

దిశ, వెబ్‌డెస్క్: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయమై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మంగళవారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా-తెలుగు వారి ఆత్మగౌరవానికి, ఆకాంక్షలకు ప్రతీక అయిన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకొనే అంశంపై చర్చించిన్నట్లు సమాచారం. బుధవారం బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డాతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయం ఉపసంహరించుకోవాలని పవన్‌ కల్యాణ్‌ విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. అంతేగాకుండా భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకత్వంతో ప్రస్తుత ఏపీ రాజకీయ పరిస్థితిపై చర్చిస్తున్నట్టు సమాచారం. పవన్‌ వెంట పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఉన్నారు.

Tags:    

Similar News