ఉత్కంఠగా మారిన బీజేపీ, జనసేన రామతీర్థ ధర్మయాత్ర
దిశ, వెబ్‌డెస్క్: విజయనగరం జిల్లా రామతీర్థం ఆలయంలోని విగ్రహాల ధ్వంసం ఘటనపై బీజేపీ, జనసేన ధర్మయాత్ర పేరుతో నిరసన కార్యక్రమం చేపట్టనుంది. నేడు బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు ఆధ్వర్యంలో రామతీర్థ ధర్మయాత్ర చేపట్టనున్నారు. రామతీర్ధం కొండపై విగ్రహ ధ్వంసం ఘటనాస్థలాన్ని పరిశీలించనున్నారు. ఉత్తరాంధ్రతో పాటు పలు జిల్లాల నుంచి కార్యకర్తలు హాజరుకానున్నారు. బీజేపీ, జనసేన కార్యకర్తలతో పాటు పలు ధార్మిక సంస్థలు పాల్గొనే అవకావం ఉన్నట్లు తెలుస్తుంది. విశాఖ నుంచి రామతీర్థం వరకు మెగా […]
దిశ, వెబ్‌డెస్క్: విజయనగరం జిల్లా రామతీర్థం ఆలయంలోని విగ్రహాల ధ్వంసం ఘటనపై బీజేపీ, జనసేన ధర్మయాత్ర పేరుతో నిరసన కార్యక్రమం చేపట్టనుంది. నేడు బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు ఆధ్వర్యంలో రామతీర్థ ధర్మయాత్ర చేపట్టనున్నారు. రామతీర్ధం కొండపై విగ్రహ ధ్వంసం ఘటనాస్థలాన్ని పరిశీలించనున్నారు. ఉత్తరాంధ్రతో పాటు పలు జిల్లాల నుంచి కార్యకర్తలు హాజరుకానున్నారు. బీజేపీ, జనసేన కార్యకర్తలతో పాటు పలు ధార్మిక సంస్థలు పాల్గొనే అవకావం ఉన్నట్లు తెలుస్తుంది.
విశాఖ నుంచి రామతీర్థం వరకు మెగా కార్ ర్యాలీ నిర్వహించనున్నారు. ర్యాలీని సోము వీర్రాజు ప్రారంభించనున్నారు. అయితే బీజేపీ రామతీర్థ ధర్మయాత్రకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. రామతీర్థం పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా బందోబస్తును ఏర్పాటు చేశారు. రామతీర్థంలో సెక్షన్ 30, పోలీస్ యాక్ట్ 1861 అమలులో ఉంది.