‘జానారెడ్డి’ సంచలన నిర్ణయం..
దిశ, తెలంగాణ బ్యూరో : నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో ప్రజాతీర్పును గౌరవిస్తానని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి తెలిపారు. సాగర్ లెక్కింపు తర్వాత ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్అధినేత సోనియా గాంధీ ఆదేశాలు, సాగర్‌లో పార్టీ కార్యకర్తలకు అండగా ఉండేందుకే ఈ ఎన్నికల్లో పోటీ చేశానన్నారు. అయితే ప్రస్తుతం కొంతకాలం ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని, అవసరమైనప్పుడు వస్తానని జానారెడ్డి వ్యాఖ్యానించారు. సాగర్నియోజకవర్గంలో భయంతో కొంతమంది ఓట్లేశారని, మరికొంత మంది ప్రభుత్వానికి అండగా ఉంటే […]
దిశ, తెలంగాణ బ్యూరో : నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో ప్రజాతీర్పును గౌరవిస్తానని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి తెలిపారు. సాగర్ లెక్కింపు తర్వాత ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్అధినేత సోనియా గాంధీ ఆదేశాలు, సాగర్‌లో పార్టీ కార్యకర్తలకు అండగా ఉండేందుకే ఈ ఎన్నికల్లో పోటీ చేశానన్నారు. అయితే ప్రస్తుతం కొంతకాలం ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని, అవసరమైనప్పుడు వస్తానని జానారెడ్డి వ్యాఖ్యానించారు.
సాగర్నియోజకవర్గంలో భయంతో కొంతమంది ఓట్లేశారని, మరికొంత మంది ప్రభుత్వానికి అండగా ఉంటే ఇంకేమైనా వస్తాయనే ఆశతో ఓట్లేశారన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పితే అధిష్టానం అమలు చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఆదేశించినవన్నీ చేశానని, సాగర్ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇష్టం లేకున్నా అధిష్టానం చెబితేనే పోటీ చేశానన్నారు. ఇక ముందు ఎన్నికల్లో పోటీ చేసే ఆతృత లేదని, అవసరం లేదని.. ఇక నుంచి పోటీ చేయనని, ప్రత్యక్ష రాజకీయాలకు కొంతకాలం దూరంగా ఉంటానన్నారు. ఇదే తనకు ఆఖరి ఎన్నిక అని జానారెడ్డి వ్యాఖ్యానించారు. పార్టీలో ఏదైనా అవసరం ఉన్నప్పుడు మాత్రం తన వంతు పాత్రను పోషిస్తానన్నారు.