జనగామ డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి అరెస్ట్
దిశ ప్రతినిధి, వరంగల్ : వివిధ కేసుల్లో నిందితుడిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ జనగామ జిల్లా అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడంతో వరంగల్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాజీపేట మండలం టేకులపల్లిలో జంగా రాఘవరెడ్డి తన ఇంట్లో ఉండగా పోలీసులు అక్కడికి చేరుకుని అరెస్ట్ చేశారు. బలవంతంగా తమవెంట తీసుకెళ్లారు. ఎక్కడికి తీసుకెళ్లిందనేది ఇంకా స్పష్టత లేకపోవడం గమనార్హం. అంతకుముందు రాఘవరెడ్డిని పోలీసులు తీసుకెళ్తుండగా అనుచరులు, పార్టీ కార్యకర్తలు అడ్డుకునేందుకు యత్నించారు. ఈసందర్భంగా పోలీసులకు […]
దిశ ప్రతినిధి, వరంగల్ : వివిధ కేసుల్లో నిందితుడిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ జనగామ జిల్లా అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడంతో వరంగల్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాజీపేట మండలం టేకులపల్లిలో జంగా రాఘవరెడ్డి తన ఇంట్లో ఉండగా పోలీసులు అక్కడికి చేరుకుని అరెస్ట్ చేశారు. బలవంతంగా తమవెంట తీసుకెళ్లారు. ఎక్కడికి తీసుకెళ్లిందనేది ఇంకా స్పష్టత లేకపోవడం గమనార్హం. అంతకుముందు రాఘవరెడ్డిని పోలీసులు తీసుకెళ్తుండగా అనుచరులు, పార్టీ కార్యకర్తలు అడ్డుకునేందుకు యత్నించారు. ఈసందర్భంగా పోలీసులకు వారికి తోపులాట జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీస్‌శాఖ ఇప్పటి వరకు వెల్లడించలేదు.
అయితే పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న రాఘవరెడ్డి కొంతకాలంగా అజ్ఞాతంలో ఉంటూ వస్తున్నారు. ఆయన గురువారం ఇంట్లో ఉన్న విషయం తెలుసుకున్న పోలీసులు అరెస్ట్ చేశారు. విషయం తెలుసుకున్న వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున మడికొండ పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకుంటున్నారు. జంగా రాఘవరెడ్డిని చూపించాలని ఆందోళనకు దిగుతున్నారు.