చంద్రబాబు మొహం చూడాలి.. బీఏసీ మీటింగ్‌లో సీఎం జగన్..
దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ అధినేత చంద్రబాబుకు గట్టి షాక్ తగిలింది. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ దుంభి మోగించింది. తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న కుప్పం గడ్డపై తొలిసారిగా వైసీపీ జెండా ఎగురవేసింది. దీంతో చంద్రబాబుపై వైసీపీ తీవ్ర విమర్శల దాడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే గురువారం ఉదయం అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి బీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హాజరయ్యారు. ఈ […]
దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ అధినేత చంద్రబాబుకు గట్టి షాక్ తగిలింది. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ దుంభి మోగించింది. తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న కుప్పం గడ్డపై తొలిసారిగా వైసీపీ జెండా ఎగురవేసింది. దీంతో చంద్రబాబుపై వైసీపీ తీవ్ర విమర్శల దాడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే గురువారం ఉదయం అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి బీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హాజరయ్యారు.
ఈ సమావేశంలో కుప్పం మున్సిపల్ ఎన్నికపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. టీడీపీ అధ్యక్షడు చంద్రబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ముఖం చూడాలని ఉందంటూ జగన్ సెటైర్లు వేశారు. చంద్రబాబును సభకు తీసుకురావాలని అచ్చెన్నాయుడును కోరారు. కుప్పం ఫలితాల తర్వాత ఆయన మొహం చూడాలని ఉందంటూ జగన్ వ్యాఖ్యానించగా సభలో ఒక్కసారిగా నవ్వులు పూశాయి. ఇకపోతే ఇటీవల కుప్పం పర్యటనలో సీఎం జగన్‌ను ఉద్దేశించి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
మిస్టర్ జగన్ కుప్పం వస్తావా.. అడుగుపెడతావా అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా వాటిని గుర్తు చేస్తూ జగన్ కౌంటర్ ఇచ్చారంటూ అంతా భావించారు. అయితే జగన్ వ్యాఖ్యలపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడు సభకు ఖచ్చితంగా హాజరవుతారని.. వైసీపీ అరాచకాలను నిలదీస్తారని అచ్చెన్నాయుడు సమాధానం ఇచ్చారు.