దళితుల పథకాలను సర్కార్ ఎత్తివేస్తుంది

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ ప్రభుత్వంపై అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అణిచివేత పాలనసాగుతోందని విమర్శించారు. రాజమహేంద్రవరంలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన ఎస్సీ, ఎస్టీలను టార్గెట్ చేస్తూ వైసీపీ ప్రభుత్వం రాజకీయం చేస్తోందని ఆరోపించారు. రాష్ట్ర చరిత్రలో ఏ రాజకీయ పార్టీకూడా ఎస్సీఎస్టీలను టార్గెట్ చేసి పరిపాలన చేయలేదని.. ఒక్క వైఎస్సార్సీపీ మాత్రమే ఈ విధంగా చేస్తోందని హర్షకుమార్ మండిపడ్డారు. ఎస్సీల పథకాలను క్రమంగా వైసీపీ ప్రభుత్వం ఎత్తివేస్తోందని […]

Update: 2021-08-06 08:00 GMT

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ ప్రభుత్వంపై అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అణిచివేత పాలనసాగుతోందని విమర్శించారు. రాజమహేంద్రవరంలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన ఎస్సీ, ఎస్టీలను టార్గెట్ చేస్తూ వైసీపీ ప్రభుత్వం రాజకీయం చేస్తోందని ఆరోపించారు. రాష్ట్ర చరిత్రలో ఏ రాజకీయ పార్టీకూడా ఎస్సీఎస్టీలను టార్గెట్ చేసి పరిపాలన చేయలేదని.. ఒక్క వైఎస్సార్సీపీ మాత్రమే ఈ విధంగా చేస్తోందని హర్షకుమార్ మండిపడ్డారు. ఎస్సీల పథకాలను క్రమంగా వైసీపీ ప్రభుత్వం ఎత్తివేస్తోందని ధ్వజమెత్తారు. ఎస్సీ కార్పొరేషన్ ఉన్నప్పటికీ రుణాలు మాత్రం ఇవ్వడం లేదన్నారు. మరోవైపు ఇంటర్‌ ఫీజులను ఏ కార్పొరేట్‌ కాలేజీ పట్టించుకోవడంలేదని ఆరోపించారు. కార్పొరేట్‌ కాలేజీలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని హర్షకుమార్‌ విమర్శించారు.

Tags:    

Similar News