మూడు రాజధానుల విషయంలో వెనక్కి తగ్గిన జగన్ సర్కార్…అసలు చిక్కు ఇదేనా?

దిశ, ఏపీ బ్యూరో: మూడు రాజధానుల చట్టం ఉపసంహరణ పూర్తిగానా? లేక మరో రూపంలో ప్రవేశ పెట్టడానికా? అన్న చర్చ ఏపీలో జరుగుతుంది. కేబినెట్ అత్యవసర భేటీలో మూడు రాజధానుల అంశంపై ప్లానింగ్ శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ ప్రజెంటేషన్‌లో సాంకేతికంగా ఎదురవుతున్న ఇబ్బందులపై క్లియర్‌గా వివరించినట్లు తెలుస్తోంది. మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న తర్వాత పలు సందర్భాల్లో ఎదురైన చిక్కులను సమగ్రంగా వివరించారు. అనంతరం ప్రస్తుతం ఉన్న రూపంలో చిక్కులు తప్పవనే […]

Update: 2021-11-22 03:12 GMT

దిశ, ఏపీ బ్యూరో: మూడు రాజధానుల చట్టం ఉపసంహరణ పూర్తిగానా? లేక మరో రూపంలో ప్రవేశ పెట్టడానికా? అన్న చర్చ ఏపీలో జరుగుతుంది. కేబినెట్ అత్యవసర భేటీలో మూడు రాజధానుల అంశంపై ప్లానింగ్ శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ ప్రజెంటేషన్‌లో సాంకేతికంగా ఎదురవుతున్న ఇబ్బందులపై క్లియర్‌గా వివరించినట్లు తెలుస్తోంది. మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న తర్వాత పలు సందర్భాల్లో ఎదురైన చిక్కులను సమగ్రంగా వివరించారు.

అనంతరం ప్రస్తుతం ఉన్న రూపంలో చిక్కులు తప్పవనే అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తోంది. ఏ కోర్టూ అడ్డుకట్టలు వేయలేని విధంగా కొత్త బిల్లు రూపకల్పన కోసం మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది. ఇక మండలిలో వైసీపీ ఆధిపత్యం రావడం, కోర్టుల విషయంలో ఎదురవుతున్న ఇబ్బందుల దృష్ట్యా వాటిని అధిగమించేలా కొత్త బిల్లు రూపకల్పన చేయనున్నట్లు తెలుస్తోంది. గతంలో మండలిలో వైసీపీ ఆధిపత్యం లేకపోవడంతో కౌన్సిల్‌లో బిల్ హోల్డ్ అయింది.

నాటి మండలి చైర్మన్ బిల్లును సెలెక్ట్ కమిటీకి రిఫర్ చేసిన సంగతి తెలిసిందే. అసెంబ్లీలో బిల్లుకు ఆమోదం లభించినప్పటికీ మండలిలో మాత్రం కాలేదు. ఈ తరుణంలో ఇలాంటి సాంకేతిక సమస్యలు అడ్డు రాకుండా ఉండేందుకు కొత్త బిల్లు పెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కౌన్సిల్‌లో సంపూర్ణ మెజారిటీ ఉంది కాబట్టి బిల్లు పాస్ అయ్యేందుకు కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవని వైసీపీ వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

సమంత టీఆర్‌ఎస్‌లో చేరనుందా? కేటీఆర్ ట్వీట్‌‌కు రిప్లయ్‌.. ఆంతర్యమేంటి?

Tags:    

Similar News