‘వివేకాను హత్య చేసింది ఎవరో జగన్‌కు తెలుసు’

దిశ, ఏపీ బ్యూరో: మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డిని ఎవరు హత్య చేశారో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఖచ్చితంగా తెలుసునంటూ టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. పులివెందుల మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన వివేకానంద రెడ్డి హత్య కేసుపై స్పందించారు. వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తులో పలు అనుమానాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. నిందితులను తప్పించేందుకు జగన్ కుట్రపన్నుతున్నారని ఆరోపించారు. ఈ హత్యకేసు విచారణలో గతంలో కడప ఎస్పీ అభిషేక్ మహంతి దీర్ఘకాలిక […]

Update: 2021-08-03 23:46 GMT

దిశ, ఏపీ బ్యూరో: మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డిని ఎవరు హత్య చేశారో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఖచ్చితంగా తెలుసునంటూ టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. పులివెందుల మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన వివేకానంద రెడ్డి హత్య కేసుపై స్పందించారు. వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తులో పలు అనుమానాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. నిందితులను తప్పించేందుకు జగన్ కుట్రపన్నుతున్నారని ఆరోపించారు.

ఈ హత్యకేసు విచారణలో గతంలో కడప ఎస్పీ అభిషేక్ మహంతి దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడం, ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో సీబీఐ ఉన్నతాధికారి సుధాసింగ్ దర్యాప్తు నుంచి తప్పుకోవడం పట్ల ఆయన అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. నిందితులను తప్పించేందుకే జగన్ పకడ్బందీగా వ్యూహాలు రచిస్తున్నారని ధ్వజమెత్తారు. మరోవైపు సీబీఐ అదుపులో ఉన్న సునీల్ కుమార్ యాదవ్ హైకోర్టులో వేసిన పిటిషన్‌లో తన పేరు ప్రస్తావించడంపై ఆయన స్పందించలేదు. సునీల్ కుమార్ యాదవ్ పిటిషన్‌లో వివేకా కూతురు సునీతారెడ్డితో పాటు మాజీమంత్రి ఆదినారాయణ రెడ్డి, తనను కూడా విచారించాలని కోరినట్లు ప్రచారం జరుగుతుందని అందులో వాస్తవమేంటో తెలియదని ఎమ్మెల్సీ బీటెక్ రవి అన్నారు.

Tags:    

Similar News