వైజాగ్ చేరిన జగన్.. చేరనున్న చంద్రబాబు

దిశ ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖపట్టణం చేరుకున్నారు. విశాఖపట్టణంలోని గోపాలపట్నం దగ్గర ఆర్ఆర్ వెంకటాపురం చేరుకుంటారు. అక్కడ ఎల్జీ పాలిమర్స్ కంపెనీతో పాటు ఆర్ఆర్ పురంలో పర్యటించనున్నారు. అనంతరం కేజీహెచ్‌కు వెళ్లి అక్కడ గ్యాస్ లీక్ దుర్ఘటన బాధితులతో పాటు, మృతుల కుటుంబాలను పరామర్శిస్తారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి, కంపెనీపై చర్యలు, బాధితులకు ఎక్స్ గ్రేషియా వంటివి ప్రకటిస్తాని తెలుస్తోంది. కాగా, ఈ దుర్ఘటనలో 8 మంది మృత్యువాత […]

Update: 2020-05-07 03:02 GMT

దిశ ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖపట్టణం చేరుకున్నారు. విశాఖపట్టణంలోని గోపాలపట్నం దగ్గర ఆర్ఆర్ వెంకటాపురం చేరుకుంటారు. అక్కడ ఎల్జీ పాలిమర్స్ కంపెనీతో పాటు ఆర్ఆర్ పురంలో పర్యటించనున్నారు. అనంతరం కేజీహెచ్‌కు వెళ్లి అక్కడ గ్యాస్ లీక్ దుర్ఘటన బాధితులతో పాటు, మృతుల కుటుంబాలను పరామర్శిస్తారు.

అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి, కంపెనీపై చర్యలు, బాధితులకు ఎక్స్ గ్రేషియా వంటివి ప్రకటిస్తాని తెలుస్తోంది. కాగా, ఈ దుర్ఘటనలో 8 మంది మృత్యువాత పడగా, 80 మంది వెంటిలేటర్‌పై చికిత్స తీసుకుంటున్నారు. మిగిలిన 200 మందికి చికిత్సనందిస్తున్నారు. ఒకవైపు సీఎం, మరోవైపు పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విశాఖపట్టణంలో పర్యటించేందుకు, సహాయక చర్యల్లో పాలుపంచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి కోరారు. ఆయన కోరిక మేరకు కేంద్రం అనుమతినిచ్చింది. దీంతో ఆయన కూడా వైజాగ్ బయల్దేరనున్నారు. అక్కడ బాధితులను పరామర్శించనున్నారు.

Tags: ap cm, ys jagan, ysrcp, tdp, chandrababu naidu, ap

Tags:    

Similar News