పవన్ అభిమానికి జగన్ సాయం

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. అతను ప్రతిపక్ష నేత అభిమాని. ప్రస్తుతం ఆపదలో ఉన్నాడు. ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి వెంటనే స్పందించాడు. చికిత్స నిమిత్తిం రూ. 10 లక్షలు మంజూరు చేశారు. దీంతో ఆ ముఖ్యమంత్రిపై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. పిఠాపురం నియోజకవర్గానికి చెందిన నాగేంద్ర అనే వ్యక్తి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అభిమాని. అయితే, ఇతను […]

Update: 2020-08-16 01:31 GMT

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. అతను ప్రతిపక్ష నేత అభిమాని. ప్రస్తుతం ఆపదలో ఉన్నాడు. ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి వెంటనే స్పందించాడు. చికిత్స నిమిత్తిం రూ. 10 లక్షలు మంజూరు చేశారు. దీంతో ఆ ముఖ్యమంత్రిపై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.

వివరాల్లోకి వెళితే.. పిఠాపురం నియోజకవర్గానికి చెందిన నాగేంద్ర అనే వ్యక్తి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అభిమాని. అయితే, ఇతను రక్త సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. అతనికి అత్యవసర చికిత్స చేయాల్సి వచ్చింది. ఈ విషయమై ఓ స్వచ్ఛంద సంస్ధ ట్వీట్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లాడు. వెంటనే జగన్ రూ. 10 లక్షలు మంజూరు చేశారు. ఈ మేరకు సీఎంవో స్పెషల్ ఆఫీసర్.. సంబంధిత ఆస్పత్రికి ఎల్వోసీని అందజేశారు. వెంటనే నాగేంద్రకు స్టెమ్ సెల్ థెరపి చికిత్స అందించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకబడగా ఉంది. ఈ విషయాన్ని సీఎం అధికారులు తెలిపినట్లు సమాచారం.

Tags:    

Similar News