పోలీస్ కంప్లైంట్ అథారిటీ ఏర్పాటుకు జగన్ గ్రీన్ సిగ్నల్
దిశ, ఏపీ బ్యూరో: పోలీస్ కంప్లైంట్ అథారిటీని ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పీసీఏ చైర్మన్‌గా జస్టిస్ కనగరాజ్‌ను నియమించనున్నట్లు సమాచారం. గత ఏడాది ఎస్ఈసీగా కనగరాజ్ నియామకం జరగ్గా ఊహించని పరిణామాల నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలతో ఆ పదవిని వదులు కోవాల్సి వచ్చింది. ఆయనకు సముచిత గౌరవం కల్పించాలని సీఎం వైఎస్ జగన్ భావిస్తున్నారు. అందులో భాగగానే పోలీసులపై ఫిర్యాదులను విచారించే పోలీస్ కంప్లైంట్ అథారిటీని ఏర్పాటు చేయాలని యోచనలో ఉన్నారు. పోలీసులు […]
దిశ, ఏపీ బ్యూరో: పోలీస్ కంప్లైంట్ అథారిటీని ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పీసీఏ చైర్మన్‌గా జస్టిస్ కనగరాజ్‌ను నియమించనున్నట్లు సమాచారం. గత ఏడాది ఎస్ఈసీగా కనగరాజ్ నియామకం జరగ్గా ఊహించని పరిణామాల నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలతో ఆ పదవిని వదులు కోవాల్సి వచ్చింది. ఆయనకు సముచిత గౌరవం కల్పించాలని సీఎం వైఎస్ జగన్ భావిస్తున్నారు. అందులో భాగగానే పోలీసులపై ఫిర్యాదులను విచారించే పోలీస్ కంప్లైంట్ అథారిటీని ఏర్పాటు చేయాలని యోచనలో ఉన్నారు.
పోలీసులు న్యాయం చేయకపోయినా, బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించకపోయిన, సకాలంలో న్యాయం లభించక పోయినా ప్రజలు పీసీఏను ఆశ్రయించవచ్చు. పోలీసులపై వచ్చే ఫిర్యాదులను విచారించేందుకు రాష్ట్రాలు పీసీఏను ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. దీంతో పలు రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ అథారిటీలు ఏర్పాటయ్యాయి. తెలంగాణలో కూడా ఈ ఏడాది జనవరిలో పీసీఏను ఏర్పాటు చేశారు. హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తిని చైర్మన్‌గా పీసీఏను ఏర్పాటు చేయాలి అని నిబంధనలు ఉన్నాయి. పీసీఏలో రిటైర్డ్ ఐఏఎస్, రిటైర్డ్ ఐపీఎస్‌లతో పాటు ఒక స్వచ్ఛంద సంస్థ నుంచి ప్రభుత్వం ఎంపిక చేసిన వ్యక్తి సభ్యులుగా ఉంటారు. తమకు అందే ఫిర్యాదులపై పీసీఏ విచారణ చేసి బాధ్యులైన పోలీసులపై చర్యలకు ప్రభుత్వానికి సిఫారసు చేస్తారు. పీసీఏ సిఫారసులను ప్రభుత్వం కచ్చితంగా అమలు చేయాలా వద్ద అనేది ప్రభుత్వ నిర్ణయం. ఈ అథారిటీ ఏర్పాటుపై రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.