రేపు ఢిల్లీకి సీఎం జగన్.. పలువురు కేంద్రమంత్రులతో భేటీ

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం ఉదయం 10 గంటలకు ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌లతోపాటు పలువురు కేంద్రమంత్రులతో భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్, ప్రస్తుత రాజకీయ పరిణామాలు, విభజన హామీలు, పోలవరం ప్రాజెక్ట్‌తోపాటు రాష్ట్రానికి రావాల్సిన నిధులుపై సీఎం జగన్ సంబంధిత శాఖల మంత్రులతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే కరోనా దృష్ట్యా […]

Update: 2021-06-09 10:48 GMT

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం ఉదయం 10 గంటలకు ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌లతోపాటు పలువురు కేంద్రమంత్రులతో భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్, ప్రస్తుత రాజకీయ పరిణామాలు, విభజన హామీలు, పోలవరం ప్రాజెక్ట్‌తోపాటు రాష్ట్రానికి రావాల్సిన నిధులుపై సీఎం జగన్ సంబంధిత శాఖల మంత్రులతో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

అలాగే కరోనా దృష్ట్యా రాష్ట్రానికి నిధులు ఇచ్చి ఆదుకోవాలని సీఎం జగన్ కోరనున్నట్లు సమాచారం. తిరిగి శుక్రవారం మధ్యాహ్నాం తాడేపల్లి చేరుకుంటారు. వాస్తవానికి సోమవారం ఢిల్లీ వెళ్లాలని సీఎం జగన్ నిర్ణయించుకున్నారు. అయితే కేంద్రమంత్రుల అపాయింట్మెంట్లు లభించకపోవడంతో పర్యటన గురువారానికి వాయిదా పడిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News