శ్రీశైలం ప్రమాదంపై ప్రముఖులు దిగ్భ్రాంతి
దిశ, వెబ్ డెస్క్: శ్రీశైలం అగ్నిప్రమాదం ఘటనపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని ఘటనా స్థలానికి పంపించామని, గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని ఆయన చెప్పారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్, ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కూడా శ్రీశైలం అగ్నిప్రమాదం ఘటనపై విచారం వ్యక్తం చేశారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని, సొరంగంలో చిక్కుకున్నవారు సురక్షితంగా బయటపడాలని వారు […]
దిశ, వెబ్ డెస్క్: శ్రీశైలం అగ్నిప్రమాదం ఘటనపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని ఘటనా స్థలానికి పంపించామని, గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని ఆయన చెప్పారు.
అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్, ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కూడా శ్రీశైలం అగ్నిప్రమాదం ఘటనపై విచారం వ్యక్తం చేశారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని, సొరంగంలో చిక్కుకున్నవారు సురక్షితంగా బయటపడాలని వారు ఆకాక్షించారు. సహాయక చర్యల్లో అవసరమైతే తెలంగాణ అధికారులకు సహకరించాలని ఆంధ్రప్రదేశ్ అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.