ఘనంగా.. ఇంద్రకీలాద్రిపై జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల సంస్మరణ ఉత్సవాలు..

దిశ, ఏపీ బ్యూరో : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల సంస్మరణ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలతో ఈ సంస్మరణ ఉత్సవాలు నిర్వహించినట్లు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్రంలో ఆదిశంకరాచార్యులు సందర్శించిన 14 దేవాలయాల్లో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇంద్రకీలాద్రిపై శుక్రవారం నిర్వహించిన ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి వెల్లంపల్లి​ శ్రీనివాస్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘జగద్గురు ఆదిశంకరాచార్యులు భగవత్‌ స్వరూపులు. కేదార్‌నాథ్‌లో ఆదిశంకరాచార్యుల సంస్మరణోత్సవాలను ప్రధాని మోడీ నిర్వహించడం […]

Update: 2021-11-05 08:18 GMT

దిశ, ఏపీ బ్యూరో : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల సంస్మరణ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలతో ఈ సంస్మరణ ఉత్సవాలు నిర్వహించినట్లు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు.

రాష్ట్రంలో ఆదిశంకరాచార్యులు సందర్శించిన 14 దేవాలయాల్లో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇంద్రకీలాద్రిపై శుక్రవారం నిర్వహించిన ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి వెల్లంపల్లి​ శ్రీనివాస్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘జగద్గురు ఆదిశంకరాచార్యులు భగవత్‌ స్వరూపులు. కేదార్‌నాథ్‌లో ఆదిశంకరాచార్యుల సంస్మరణోత్సవాలను ప్రధాని మోడీ నిర్వహించడం సంతోషంగా ఉంది. ఆయన సందర్శించిన పవిత్రస్థలాల్లో సంస్మరణ ఉత్సవాలు నిర్వహించాం.

ఆదిశంకరాచార్యులు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో శ్రీచక్రం ప్రతిష్ఠించారు. అందుకే దుర్గమ్మ ఆలయంలో కూడా సంస్మరణోత్సవాన్ని నిర్వహించామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. కేదార్‌నాథ్‌లో ప్రధాని నిర్వహించిన కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఏర్పాట్లు సైతం చేసినట్లు తెలిపారు. ఆదిశంకరాచార్యుల విశిష్టతను ప్రపంచానికి తెలియజేసేలా ప్రధాని మోడీ అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టారని ఈ సందర్భంగా మోడీకి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు.

Tags:    

Similar News