శ్రేయస్‌కు ఫుల్ శాలరీ

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ 14వ సీజన్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా దూరమయ్యాడు. దీంతో అతని స్థానంలో రిషబ్ పంత్‌ను కెప్టెన్‌గా నియమించారు. ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ అయ్యర్ గాయపడటంతో అతడు మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. కాగా, శ్రేయస్ భుజానికి అయిన గాయానికి శస్త్ర చికిత్స జరిగింది. కనీపం 5 వారాల పాటు అతడు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. అయితే గత సీజన్‌లో అయ్యర్ ఢిల్లీ […]

Update: 2021-04-02 08:57 GMT

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ 14వ సీజన్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా దూరమయ్యాడు. దీంతో అతని స్థానంలో రిషబ్ పంత్‌ను కెప్టెన్‌గా నియమించారు. ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ అయ్యర్ గాయపడటంతో అతడు మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు.

కాగా, శ్రేయస్ భుజానికి అయిన గాయానికి శస్త్ర చికిత్స జరిగింది. కనీపం 5 వారాల పాటు అతడు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. అయితే గత సీజన్‌లో అయ్యర్ ఢిల్లీ జట్టును ఫైనల్ వరకు నడిపించాడు. ఈ సీజన్‌కు శ్రేయస్ దూరమైనా అతడికి పూర్తి వేతనం చెల్లించాలని ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుతం అయ్యర్ వేతనం రూ. 7 కోట్లుగా ఉన్నది. ఆ పూర్తి మొత్తం చెల్లించేలా యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకున్నది.

Tags:    

Similar News