తృటిలో తప్పిన ఎన్‌కౌంటర్

దిశ, భద్రాచలం : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతెవాడ జిల్లా కిరాండల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని టికాన్‌పాల్ – గచపారా కొండల్లో ఎన్‌కౌంటర్ తృటిలో తప్పింది. మలంగీర్ ఏరియా కమిటీ కార్యదర్శి సోముడు, ఏసీఎం కమలేశ్, సంతోశ్, ముఖేశ్, లక్మాతోసహా 10 నుంచి 12 మంది నక్సల్స్ ఆ ప్రాంతంలో ఉన్నట్లుగా నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. ఈ మేరకు డీఆర్‌జి జవాన్లు వెళ్ళి గాలిస్తుండగా పోలీసుల రాకను ముందుగానే గమనించిన నక్సల్స్ మెల్లగా అక్కడ నుంచి తప్పించుకున్నారు. […]

Update: 2021-04-18 05:06 GMT

దిశ, భద్రాచలం : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతెవాడ జిల్లా కిరాండల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని టికాన్‌పాల్ – గచపారా కొండల్లో ఎన్‌కౌంటర్ తృటిలో తప్పింది. మలంగీర్ ఏరియా కమిటీ కార్యదర్శి సోముడు, ఏసీఎం కమలేశ్, సంతోశ్, ముఖేశ్, లక్మాతోసహా 10 నుంచి 12 మంది నక్సల్స్ ఆ ప్రాంతంలో ఉన్నట్లుగా నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. ఈ మేరకు డీఆర్‌జి జవాన్లు వెళ్ళి గాలిస్తుండగా పోలీసుల రాకను ముందుగానే గమనించిన నక్సల్స్ మెల్లగా అక్కడ నుంచి తప్పించుకున్నారు. అనంతరం నక్సల్స్ మకాం వేసిన శిబిరం వద్ద వంట సామాగ్రి, సాహిత్య పుస్తకాలు, రోజువారి వినియోగ సామాగ్రిని జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన దంతెవాడ ఎస్‌పి డాక్టర్ అభిషేక్ పల్లవ్ ధృవీకరించారు. తప్పించుకున్న నక్సల్స్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

 

Tags:    

Similar News