పాఠశాలలో క్షుద్రపూజల కలకలం
దిశ, వెబ్‌డెస్క్: కర్నూలు జిల్లాలో క్షుద్రపూజలు కలకలం రేపుతోంది. జిల్లా కేంద్రంలోని హైస్కూల్ స్టేడియంలో గుర్తుతెలియని వ్యక్తులు ముగ్గులు, దీపాలు వెలిగించారు. అంతేగాకుండా నిమ్మకాయలు, పసుపు, కుంకుమ వేయడంతో క్షుద్రపూజలు చేసినట్టు గురువారం అటుగా వెళ్లిన స్థానికులు గుర్తించారు. దీంతో పిల్లలను బడికి పంపేందుకు తల్లిదండ్రులు జంకుతున్నారు. స్థానికుల సాయంతో సమాచారం అందకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.