సుప్రీం తీర్పుపై రివ్వూ పిటిషన్ వేయండి
ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పై కేంద్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయాలని నిజామాబాద్ జిల్లా కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు నగరంలోని అంబేద్కర్ కాలనీలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన తెలియజేసింది. కేవీపీఎస్ జిల్లా అధ్యక్షడు మల్యాల గోవర్థన్ మాట్లాడుతూ…రిజర్వేషన్లపై పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి థావర్ చంద్ గెహ్లాట్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఆయన కోరారు. రిజర్వేషన్లపై సుప్రీం ఇచ్చిన […]
ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పై కేంద్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయాలని నిజామాబాద్ జిల్లా కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు నగరంలోని అంబేద్కర్ కాలనీలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన తెలియజేసింది. కేవీపీఎస్ జిల్లా అధ్యక్షడు మల్యాల గోవర్థన్ మాట్లాడుతూ…రిజర్వేషన్లపై పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి థావర్ చంద్ గెహ్లాట్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఆయన కోరారు. రిజర్వేషన్లపై సుప్రీం ఇచ్చిన తీర్పుపై రివ్వూ పిటిషన్ వేయాలని ఆయన డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో ఐద్వా కార్యదర్శి సబ్బని లత, ఎస్ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు అనిల్ తదితరులు పాల్గొన్నారు.