నింగిలోకి దూసుకెళ్లనున్న పీఎస్ఎల్వీ సీ-49
దిశ, వెబ్‌డెస్క్: నెల్లూరు జిల్లా శ్రీహరికోట షార్‌లో పీఎస్ఎల్వీ సీ-49 వాహక నౌక కౌంట్‌డౌన్ కొనసాగుతోంది. ఇవాళ మధ్యాహ్నం 3.02గంటలకు సీ-49 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. పీఎస్‌ఎల్‌వీ భారత్‌కు చెందిన ఈఓఎస్-01 సహా విదేశాలకు చెందిన తొమ్మిది ఉపగ్రహాలను నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టనుంది. దేశానికి చెందిన భూ పరిశీలన ఉపగ్రహం ద్వారా వాతావరణ, వ్యవసాయ, అటవీ సంబంధ సమాచారం తెలుసుకోవచ్చు. కరోనా మహమ్మారి మధ్య ఇస్రో ఈ ఏడాది చేపడుతున్న మొట్టమొదటి ఉపగ్రహ ప్రయోగం ఇదే. ఈ […]
దిశ, వెబ్‌డెస్క్:
నెల్లూరు జిల్లా శ్రీహరికోట షార్‌లో పీఎస్ఎల్వీ సీ-49 వాహక నౌక కౌంట్‌డౌన్ కొనసాగుతోంది. ఇవాళ మధ్యాహ్నం 3.02గంటలకు సీ-49 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. పీఎస్‌ఎల్‌వీ భారత్‌కు చెందిన ఈఓఎస్-01 సహా విదేశాలకు చెందిన తొమ్మిది ఉపగ్రహాలను నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టనుంది. దేశానికి చెందిన భూ పరిశీలన ఉపగ్రహం ద్వారా వాతావరణ, వ్యవసాయ, అటవీ సంబంధ సమాచారం తెలుసుకోవచ్చు.
కరోనా మహమ్మారి మధ్య ఇస్రో ఈ ఏడాది చేపడుతున్న మొట్టమొదటి ఉపగ్రహ ప్రయోగం ఇదే. ఈ మిషన్ పూర్తయిన వెంటనే డిసెంబర్ నాటికి కొత్త రాకెట్ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (ఎస్ఎస్ఎల్‌వీ) పరీక్షించేందుకు ఇస్రో సన్నద్ధమవుతోంది.