ఇషాంత్ శర్మ గాయానికి కుట్లు
దిశ, స్పోర్ట్స్: డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో గాయపడిన టీమ్ ఇండియా పేసర్ ఇషాంత్ శర్మకు చిన్న శస్త్ర చికిత్స నిర్వహించారు. న్యూజీలాండ్ రెండవ ఇన్నింగ్స్ ఆడుతున్న సమయంలో ఒక బంతిని ఆపే క్రమంలో ఇషాంత్ శర్మ ఉంగరపు వేలుకు గాయమైంది. దీంతో అతడు ఓవర్ పూర్తి చేయకుండానే మైదానాన్ని వీడాడు. మ్యాచ్ అనంతరం ఇషాంత్‌కు ప్రాథమిక చికిత్స చేశారు. అయితే అతడి వేలుకు చిన్న సర్జరీ అవసరం కావడంతో ఆసుపత్రికి తీసుకొని వెళ్లారు. ఇషాంత్ వేలికి నాలుగైదు […]
దిశ, స్పోర్ట్స్: డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో గాయపడిన టీమ్ ఇండియా పేసర్ ఇషాంత్ శర్మకు చిన్న శస్త్ర చికిత్స నిర్వహించారు. న్యూజీలాండ్ రెండవ ఇన్నింగ్స్ ఆడుతున్న సమయంలో ఒక బంతిని ఆపే క్రమంలో ఇషాంత్ శర్మ ఉంగరపు వేలుకు గాయమైంది. దీంతో అతడు ఓవర్ పూర్తి చేయకుండానే మైదానాన్ని వీడాడు. మ్యాచ్ అనంతరం ఇషాంత్‌కు ప్రాథమిక చికిత్స చేశారు. అయితే అతడి వేలుకు చిన్న సర్జరీ అవసరం కావడంతో ఆసుపత్రికి తీసుకొని వెళ్లారు. ఇషాంత్ వేలికి నాలుగైదు కుట్లు వేసినట్లు టీమ్ ఇండియా యాజమాన్యం తెలిపింది. అయితే అతడి గాయం అంత ప్రమాదకరమైనది ఏమీ కాదని.. ఇంగ్లాండ్ సిరీస్ కల్లా గాయం నుంచి కోలుకుంటాడని బీసీసీఐ స్పష్టం చేసింది. కాగా, భారత జట్టు గురువారం సౌతాంప్టన్ నుంచి లండన్ ప్రయాణమై వెళ్లింది. బీసీసీఐ సెలవులు మంజూరు చేయడంతో మూడు వారాల పాటు క్రికెటర్లు ఇంగ్లాండ్‌లో తమకు ఇష్టమైన ప్రదేశాలు పర్యటించనున్నారు. మూడు వారాల తర్వాత తిరిగి లండన్ చేరుకుంటారని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.