బార్‌లో మద్యం మిగిలిపోయిందా?.. ఇలా అమ్మేయండి: ఏపీ

దిశ, ఏపీ బ్యూరో: గత మార్చి 22న జనతా కర్ఫ్యూతో లాక్‌డౌన్ అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. మే 3వ తేదీన లిక్కర్ అమ్మకాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతిచ్చింది. సుమారు 40 రోజుల తరువాత లిక్కర్ షాపులు తెరుచుకోవడంతో తొలిరోజే రికార్డు స్థాయిలో 65 కోట్ల రూపాయల మద్యం విక్రయించారు. తరువాత క్రమంగా లాక్‌డౌన్ సడలింపులు అమలయ్యాయి. నెమ్మదిగా అన్ని వ్యవస్థలు తెరుచుకుంటున్నాయి. […]

Update: 2020-06-09 03:09 GMT

దిశ, ఏపీ బ్యూరో: గత మార్చి 22న జనతా కర్ఫ్యూతో లాక్‌డౌన్ అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. మే 3వ తేదీన లిక్కర్ అమ్మకాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతిచ్చింది. సుమారు 40 రోజుల తరువాత లిక్కర్ షాపులు తెరుచుకోవడంతో తొలిరోజే రికార్డు స్థాయిలో 65 కోట్ల రూపాయల మద్యం విక్రయించారు. తరువాత క్రమంగా లాక్‌డౌన్ సడలింపులు అమలయ్యాయి. నెమ్మదిగా అన్ని వ్యవస్థలు తెరుచుకుంటున్నాయి.

సోషల్ డిస్టెన్స్ నేపథ్యంలో బార్ల, రెస్టారెంట్లకు మాత్రం ఇంకా అనుమతి ఇవ్వలేదు. రెస్టారెంట్లలో పార్సిల్స్‌కి అనుమతివ్వగా, బార్లకు మాత్రం అనుమతి ఇవ్వలేదు. దీంతో, బార్లలో ఉన్న మద్యం బాటిళ్లు అలాగే ఉండిపోయాయి. లిక్కర్ పాతబడే కొద్దీ ధర పెరుగుతుందన్న ఊహాగానాలున్నప్పటికీ స్టాక్ అలాగే ఉండిపోవడంతో ట్రాన్జాక్షన్స్ జరగక బార్ల యజమానులు నష్టపోతున్నారు. అంతేకాదు, కాలపరిమతి దాటితే బీర్లు పాడైపోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బార్ యజమానులకు ఒక వెసులుబాటు కల్పించింది. బార్లలో స్టాక్ ఉన్న మద్యం బాటిళ్లను రీటెయిల్ ఔట్ లెట్లలో విక్రయించుకునే అవకాశాన్ని కల్పించింది. అయితే సీల్డ్ బాటిళ్లను మాత్రమే అమ్మాలని షరతు విధించింది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో బార్ల యజమానులకు ఊరట లభించినట్టైంది.

Tags:    

Similar News