అమరావతి ఉద్యమ ప్రభావం వైసీపీపై లేనట్లేనా?
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌లో వైసీపీ హావా కొనసాగిస్తోంది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీ అనే తేడా లేకుండా అన్నిటిలోనూ వైసీపీ విజయం సాధిస్తోంది. అయితే అమరావతి పరిధిలో కూడా వైసీపీ విజయం సాధించడం గమనార్హం. రాజధాని పరిధిలోని గుంటూరు కార్పొరేషన్‌తో పాటు విజయవాడ కార్పొరేషన్‌ను కూడా వైసీపీ తన ఖాతాలో వేసుకుంది. దీనికి బట్టి చూస్తే.. రాజధాని పరిధిలో అమరావతి ఉద్యమ ప్రభావం వైసీపీపై పడనట్లేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక విశాఖ […]
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌లో వైసీపీ హావా కొనసాగిస్తోంది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీ అనే తేడా లేకుండా అన్నిటిలోనూ వైసీపీ విజయం సాధిస్తోంది. అయితే అమరావతి పరిధిలో కూడా వైసీపీ విజయం సాధించడం గమనార్హం. రాజధాని పరిధిలోని గుంటూరు కార్పొరేషన్‌తో పాటు విజయవాడ కార్పొరేషన్‌ను కూడా వైసీపీ తన ఖాతాలో వేసుకుంది. దీనికి బట్టి చూస్తే.. రాజధాని పరిధిలో అమరావతి ఉద్యమ ప్రభావం వైసీపీపై పడనట్లేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇక విశాఖ కార్పొరేషన్‌లో కూడా వైసీపీ గెలుపు దిశగా వెళుతుండటంతో.. అక్కడ వైసీపీ గ్రాఫ్ మరింత పెరిగిందని అర్థమవుతోంది. ఇక కర్నూలులో కూడా వైసీపీనే గెలుచుకుంది. దీనిని బట్టి చూస్తే.. ఏపీలో మూడు రాజధానులకు ప్రజలు మద్దతు ఉన్నట్లు అర్థమవుతుందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
అమరావతి ఉద్యమ ప్రభావం ఎక్కువగా ఉన్న గుంటూరు, విజయవాడ కార్పొరేషన్‌తో పాటు విశాఖ కార్పొరేషన్‌ను కూడా గెలుచుకోవడంపై వైసీపీ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారిక పార్టీకే ఎక్కువగా విజయావకాశాలు ఉంటాయని, ఈ ఫలితాలను చూసి ఒక అభిప్రాయానికి రాలేమని మరికొందరు చెబుతున్నారు. అమరావతి ఉద్యమ ప్రభావం వైసీపీపై పడిందా?.. లేదా? అనేది రానున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూస్తేనే ఒక అంచనాకు రావొచ్చని అభిప్రాయపడుతున్నారు.