ఆ మహిళ తో ఎఫైరే బిల్ గేట్స్ విడాకులకు కారణమా.. ?

దిశ, వెబ్‌డెస్క్: మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తన భార్య మిలిందాతో విడిపోయిన విషయం తెలిసిందే.. అయితే అప్పటినుండి ఈ జంట విడిపోవడానికి గల కారణాలను నెటిజన్లు వెతుకుతూనే ఉన్నారు. ఇక ఎక్కువగా  బిల్ గేట్స్ తన భార్య మిలిందా విడిపోవడానికి ప్రధాన కారణం బిల్ గేట్స్ వివాహేతర సంబంధమేనని తెలుస్తోంది. ఇక అంతేకాకుండా తన సంస్థలో నుండి వైదొలగడానికి కూడా ఈ సంబంధమే కారణమని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ వెల్లడించింది. హత కొన్నేళ్ల క్రితం బిల్ […]

Update: 2021-05-17 22:44 GMT

దిశ, వెబ్‌డెస్క్: మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తన భార్య మిలిందాతో విడిపోయిన విషయం తెలిసిందే.. అయితే అప్పటినుండి ఈ జంట విడిపోవడానికి గల కారణాలను నెటిజన్లు వెతుకుతూనే ఉన్నారు. ఇక ఎక్కువగా బిల్ గేట్స్ తన భార్య మిలిందా విడిపోవడానికి ప్రధాన కారణం బిల్ గేట్స్ వివాహేతర సంబంధమేనని తెలుస్తోంది. ఇక అంతేకాకుండా తన సంస్థలో నుండి వైదొలగడానికి కూడా ఈ సంబంధమే కారణమని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ వెల్లడించింది. హత కొన్నేళ్ల క్రితం బిల్ గేట్స్ తన సంస్థలో పనిచేసే మహిళా ఇంజనీర్‌తో లైంగిక సంబంధం పెట్టుకోవాలని అనుకున్నారని, దానికి ఆ మహిళ అంగీకరించకుండా పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మైక్రోసాఫ్ట్‌ ఉద్యోగి చేసిన అభియోగంపై 2019 చివరిలో మైక్రోసాఫ్ట్‌ సంస్థ దర్యాప్తునకు ఆదేశించింది. ఇందుకోసం బయటి న్యాయ విచారణ సంస్థను నియమించిందని ఆ పత్రిక తెలిపింది. అయితే, ఈ ఆరోపణలపై దర్యాప్తు పూర్తికావడానికి ముందే బిల్‌గేట్స్‌ రాజీనామా చేశారని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పేర్కొంది. ఇక ఉద్యోగితో బిల్‌గేట్స్‌కు వివాహేతర సంబంధం ఉన్న విషయాన్ని గేట్స్‌ అధికార ప్రతినిధి అంగీకరిస్తూనే, దీనికి గేట్స్‌ బోర్డు నుండి వైదొలగానికి సంబంధం లేదనిస్పష్టం చేశారు. ఇక ఈ వివాహేతర సంబంధమే భార్యాభర్తల మధ్య బంధాన్ని బీటలువారేలా చేసి ఉంటుందని ఊహాగానాలు తలెత్తుతున్నాయి.

Tags:    

Similar News